తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fashion Tips । బ్రా సైజ్ తప్పుగా ఉంటే రొమ్ముల్లో నొప్పి, ఈ టిప్స్ పాటించండి!

Fashion Tips । బ్రా సైజ్ తప్పుగా ఉంటే రొమ్ముల్లో నొప్పి, ఈ టిప్స్ పాటించండి!

HT Telugu Desk HT Telugu

07 December 2022, 20:38 IST

    • Fashion Tips- Tips To Measure Bra Size: బ్రా సైజ్ తప్పుగా ఉంటే అది మొత్తం ఆకృతిని నాశనం చేస్తుంది, అంతేకాదు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతాయి. కరెక్ట్ సైజ్ ఎలా కొలవవచ్చో ఇక్కడ టిప్స్ చూడండి.
Fashion Tips Bra Size
Fashion Tips Bra Size (Freepik)

Fashion Tips Bra Size

Tips To Measure Bra Size Correctly: ప్రతి స్త్రీ అందంగా , ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటుంది, కానీ వారు ధరించే బ్రా ఫిట్టింగ్ సరిగ్గా లేకుంటే ఏ డ్రెస్ కూడా అందంగా కనిపించదు. తప్పు బ్రా సైజు మీ రొమ్ముల ఆకృతిని తప్పుగా కనిపించేలా చేస్తుంది, ఎంత మంచి దుస్తులు వేసుకున్నా మొత్తం రూపాన్ని నాశనం చేస్తుంది.

అంతేకాదు బ్రా సైజ్ తప్పుగా వక్షోజాలలో నొప్పి, వాపు, చికాకును కలిగిస్తుంది. వక్షోజాల పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు పొరపాటున చిన్న బ్రా సైజ్ ధరించినట్లయితే, చాలా బాధపడవలసి ఉంటుంది. కాబట్టి బ్రా సైజ్ విషయంలో మొహామాట పడటం, అశ్రద్ధ చేయడం చేయకూడదు. సరైన బ్రా సైజును గుర్తించేందుకు ఈ చిట్కాలు పాటించండి.

1. మీ బ్యాండ్ పరిమాణాన్ని కొలవండి

సాధారణంగా మీ బ్రా బ్యాండ్ కూర్చునే చోట మీ వీపు చుట్టూ, మీ రొమ్ముల దిగువన ఇంచ్ టేప్ సహాయంతో కొలవండి. టేప్ ఒక స్థిరమైన లైన్‌లో కదులుతున్నట్లు నిర్ధారించుకోండి. టేప్ గట్టిగా ఒత్తిపట్టి కాకుండా వదులుగా ఉండాలి. ఉదాహరణకు, మీ బ్రాండ్ సైజ్ 33 పాయింట్లు అయితే, దానికి మరో 4 అంగుళాలు జోడించండి. ఇది మీ సరైన బ్యాండ్ పరిమాణం.

2. మీ బస్ట్ పరిమాణాన్ని కొలవండి

మీ బస్ట్ పరిమాణాన్ని కొలవడానికి, అంగుళాల టేప్ సహాయంతో రొమ్ముల పూర్తి వెడల్పును కొలవండి. వెనుక నుండి క్లీవేజ్ మధ్య వరకు కొలవాలి. సరి సంఖ్య పరిమాణం అయితే దానికి నాలుగు అంగుళాలు జోడించండి. ఇది బేసి అయితే, ఐదు జోడించండి. ఇది మీ సరైన బస్ట్ సైజ్.

3. మీ కప్పు పరిమాణాన్ని కొలవండి

మీ కప్పు పరిమాణాన్ని పొందడానికి, మీ బ్యాండ్ సైజ్ నుండి మీ బస్ట్ సైజ్ తీసివేయండి. మీరు మీ కప్పు సైజ్ కనుగొంటారు. ఉదాహరణకు: 37 అంగుళాలు (బస్ట్) – 34 అంగుళాలు (బ్యాండ్) = 3 అంగుళాలు. అంటే మీ కప్ సైజ్ 34 C.

బ్యాండ్ సైజ్, బస్ట్ సైజ్ మధ్య వ్యత్యాసం 1 అయితే మీ కప్పు పరిమాణం A, దాని వ్యత్యాసం 2 అయితే B, 3 పైన C... మొదలైనవి.\

4. సరైన బ్రాను ఎలా ఎంచుకోవాలి

వేర్వేరు - బ్రాండ్‌ను బట్టి పరిమాణాలు మారుతూ ఉంటాయి. కాబట్టి, మీకు సరిపోయేలా ఒక కప్పు సైజుకు తగ్గించాల్సిన అవసరం ఉంటే, బ్యాండ్ సైజ్ పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, ఒక కప్పు సైజ్ 34C మీకు చాలా పెద్దదిగా ఉంటే, 36Bకి వెళ్లండి. బ్రాండ్ లేదా బ్రా రకాన్ని బట్టి మీ బ్రా పరిమాణం కొద్దిగా మారవచ్చు. సరైన ఫిట్‌ని కనుగొనడానికి కొన్ని పరీక్షలు చేయండి.

5. పర్ఫెక్ట్ బ్రా కావాలంటే

బ్రా ధరించి ప్రయత్నించండి. నడుము వద్ద ముందుకు వంగి, ఆపై హుక్ చేయండి. ఇది మీ రొమ్ములు కప్పుల్లో పూర్తిగా ఇమిడేలా చూస్తుంది. బ్యాండ్‌ని సర్దుబాటు చేయండి. బ్రా చాలా వదులుగా లేదని నిర్ధారించుకోండి. బ్యాండ్ కింద ఒక వేలు జారడానికి మాత్రమే స్థలం ఉండాలి. సైడ్ పట్టీలు పడిపోవడాన్ని చెక్ చేయండి. మొదట బ్యాండ్‌ను బిగించి, ఆపై పట్టీని తగ్గించండి.

టాపిక్

తదుపరి వ్యాసం