తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  A Guide To New-age Parenting: మీ పిల్లలు మిమ్మల్ని ఇష్టపడాలంటే..

A guide to new-age parenting: మీ పిల్లలు మిమ్మల్ని ఇష్టపడాలంటే..

HT Telugu Desk HT Telugu

14 November 2022, 16:15 IST

  • A guide to new-age parenting: ప్రొఫెసర్ డాక్టర్ అనుపమ్ సిబాల్ పేరెంటింగ్‌పై రాసిన వ్యాసమిది. ఆయన అపోలో హాస్పిటల్ గ్రూప్‌లో గ్రూప్ మెడికల్ డైరెక్టర్‌గా ఉన్నారు. సీనియర్ పీడియాట్రిషియన్. నేషనల్ బెస్ట్ సెల్లర్ ‘మీ పిల్లలు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా?’ అన్న పుస్తకాన్ని రాశారు.

సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ అనుపమ్ సిబల్
సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ అనుపమ్ సిబల్

సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ అనుపమ్ సిబల్

తాము పెరిగిన రీతిలోనే తమ పిల్లలను పెంచడమే మార్గమని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. తాము పెరిగి జీవితంలో బాగానే రాణించినందున అదే రీతిలో తమ పిల్లలను పెంచాలనుకుంటారు. రాణించడం అని నేను ఎందుకంటున్నానంటే ఇది మన దేశంలో మరీ ముఖ్యమైన అంశం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

అయితే కాలం మారుతూ వస్తోంది. ఇంతకుముందు ఎన్నడూ లేనంత వేగంగా మారుతోంది. పాత తరం ఇప్పుడు చురుగ్గా మారాలి. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఒక తరం మారిందని చెప్పడానికి 20 ఏళ్లు, 10 ఏళ్లు అంతరం అవసరం లేదు. కేవలం ఐదేళ్లలో చాలా వేగవంతమైన మార్పులు సంభవిస్తున్నాయి. నేను ఇది ప్రతి రోజూ గమనిస్తున్నా. పదేళ్ల చిన్నారితో మాట్లాడేటప్పుడు, అలాగే ఐదేళ్ల అతడి సోదరుడితో మాట్లాడుతున్నప్పుడు గమనిస్తుంటా. మార్పులను ఎప్పటికప్పుడు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండడం, వాటిని ఆచరణలో పెట్టడం తల్లిదండ్రులకు ఒక సవాలుగా మారుతుంది.

ఈ కొత్త తరం తల్లిదండ్రులు వినూత్న పేరెంటింగ్ స్టయిల్స్ అనుసరించాలి. ఇతరులలో వినయం, నిజాయితీ, కరుణ, క్షమాపణ, కృతజ్ఞత వంటి ముఖ్యమైన సద్గుణాలను పెంపొందించడంలో ప్రాథమిక అంశాలు ఎన్నడూ మారవు. అయితే పిల్లల అవసరాలను తీర్చుతూ వీటిని ఎలా నేర్పాలన్న అంశంపై పునఃపరిశీలన అవసరం.

చెప్పింది ఆచరించడం పక్కన పెట్టండి. అసలు వినడానికే ఇష్టపడని పిల్లలతో ఎలా కమ్యూనికేట్ చేయాలి? పిల్లలతో అర్థవంతమైన సంభాషణ జరపాలంటే టాపిక్, సంభాషణకు పట్టే సమయం, ఫ్రీక్వెన్సీ, అలాగే ఎప్పుడు ముగించాలి? వంటి అంశాలు కీలకం. అలాగే ఆ సంభాషణలో ఉపన్యాసాలు, పోలికలు, ‘నా అనుభవం’ వంటివి లేకుండా చూడాలి. ఈ విషయంలో ఛార్లెస్ వాడ్స్‌వార్త్ చెప్పిన విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ‘ఒక వ్యక్తి తన తండ్రి చెప్పేది నిజమే అని గ్రహించేసరికి.. తాను కరెక్ట్ కాదని ఆలోచించే ఓ కుమారుడు ఉంటాడు..’ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

చిన్నపిల్లలు అసాధారణమైన గ్రహణశీలత కలిగి ఉన్నారని గ్రహించడం ముఖ్యం. వారి కళ్ళు నిశితంగా గమనిస్తాయి. వారి చెవులు తీవ్రంగా వింటాయి. వారి మనస్సులు వారి చుట్టూ ఉండే వాటిని ఆసక్తిగా ప్రాసెస్ చేస్తాయి. చిన్న వయస్సులో ఈ అనుభవాలు జీవితకాల ముద్రను కలిగి ఉంటాయి.

జిమ్ హాన్సెన్ చెప్పింది ఇక్కడ మరిచిపోరాదు. ‘పిల్లలు మీరు ఏం చెబుతున్నారో గుర్తుంచుకోరు. మీరు ఆచరణను మాత్రమే వారు గుర్తుంచుకుంటారు..’ అని జిమ్ హాన్సెన్ చెప్పేవారు.

సాంప్రదాయక తల్లిదండ్రులు పిల్లల నుంచి చాలా ఆశిస్తున్నారు. తమ పిల్లలు వైరుద్ధ్యం చూపాలని, పిల్లలు ఎలాంటి నిరసన తెలపకుండా తాము ఆశించినట్టు ఉండాలని కోరుకుంటున్నారు. తమతో వాదించకుండా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఈకాలంలో అది జరిగే పని కాదు. పిల్లలకు సమాజంలోని చాలా సమాచారం అందుబాటులో ఉంది. పిల్లలు వారి దగ్గర ఉన్న సమాచారానికి సరితూగితేనే వారు ఆమోదం తెలుపుతారు. పిల్లలు తల్లిదండ్రులకు గౌరవం ఇస్తారు. అయితే తల్లిదండ్రులు దానిని సంపాదించుకోవడానికి శ్రమించాలి. మీకు ఇది కొత్తగా అనిపించినా.. ఒకసారి మీరు ఓపెన్ మైండ్‌తో చూస్తే మీరే అంగీకరిస్తారు.

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చక్కటి బంధం ఏర్పడాలి. అది క్రమంగా ఒక స్నేహంగా మారాలి. తమపై భేషరతుగా ప్రేమించే వారు, తమపై ఒక అభిప్రాయానికి రాకుండా ఉండే వారి వద్దకే పిల్లలు దగ్గరవుతారు. ఈ విషయంలో పేరెంట్స్ కంటే మెరుగ్గా ఎవరుంటారు?

పిల్లలతో డీల్ చేసేటప్పుడు చేయాల్సినవి, చేయకూడనివివే..

  1. తప్పులు చేయడం, తప్పులు అంగీకరించడం

• ఏ తల్లి, ఏ తండ్రీ పెర్‌ఫెక్ట్‌గా ఉండరు. తమ పిల్లలు కూడా పర్‌ఫెక్ట్‌గా ఉండాలని ఆశించకూడదు.

• ప్రతి తప్పునూ ఒక పాఠంగా చూడాలి. పేరెంట్స్, పిల్లలు కలిసి వాటి నుంచి నేర్చుకోవాలి.

• పిల్లల వైఖరిని బట్టి తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి రాకూడదు. వారి చర్యలను చూసి ఓ అభిప్రాయానికి రాకూడదు. అలా చేస్తే పేరెంట్ - చైల్డ్ రిలేషన్‌షిప్ దెబ్బతింటుంది.

2. కలలు కనే వారిగా ఉండండి.

• పిల్లలు కలలు కనేలా పేరెంట్స్ ప్రోత్సహించాలి.

• పిల్లలు తమ కలలు నెరవేర్చుకునేందుకు తల్లిదండ్రులు సాయపడాలి.

• పిల్లలు విభిన్నంగా ఏదైనా ప్రయత్నించేటప్పుడు తల్లిదండ్రులు నిరుత్సాహకపరచకూడదు.

• పేరెంట్స్ పిల్లల కలలను చంపకూడదు.

• పిల్లలు తమ కలలను నెరవేర్చాలని తల్లిదండ్రులు ఆశించకూడదు.

3. ఒత్తిడిని అధిగమించడం

పిల్లలు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. వారి ఒత్తిడికి తల్లిదండ్రులు అదనంగా జత చేయకూడదు.

• పేరెంట్స్ ఒత్తిడిని అధిగమించడంలో రోల్ మోడల్‌గా ఉండాలి.

• కొంతమేరకు ఒత్తిడి అనివార్యం. దానిని అధిగమించడంలో తల్లిదండ్రులు సాయపడాలి.

4. క్షమించడం, మరిచిపోవడం

క్షమించడం, మరిచిపోవడం వంటివి తల్లిదండ్రుల్లో పిల్లలు చూడకపోతే వారు క్షమాగుణాన్ని అలవరుచుకోలేరు.

5. మార్పు మీతోనే మొదలవ్వాలి

పేరెంట్స్ తాము మారేందుకు సిద్ధంగా లేనప్పడు వారి పిల్లల నుంచి మార్పును ఆశించకూడదు.

• తల్లిదండ్రుల్లో మార్పు కనిపిస్తే పిల్లలు కూడా మారడానికి సిద్ధంగా ఉంటారు.

(వ్యాసకర్త ప్రొఫెసర్ డాక్టర్ అనుపమ్ సిబాల్. అపోలో హాస్పిటల్ గ్రూప్‌లో గ్రూప్ మెడికల్ డైరెక్టర్. సీనియర్ పీడియాట్రిషియన్. నేషనల్ బెస్ట్ సెల్లర్ ‘మీ పిల్లు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా?’ అన్న పుస్తకాన్ని రచించారు. గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ పిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (గాపియో) ప్రెసిడెంట్‌గా ఉన్నారు..)

టాపిక్

తదుపరి వ్యాసం