తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  2023 Triumph Bonneville Speedmaster । భారత మార్కెట్లో విడుదలైన మరో లగ్జరీ బైక్!

2023 Triumph Bonneville Speedmaster । భారత మార్కెట్లో విడుదలైన మరో లగ్జరీ బైక్!

HT Telugu Desk HT Telugu

15 August 2022, 12:20 IST

    • బోనెవిల్లే స్పీడ్‌మాస్టర్ మోటార్‌సైకిల్ 2023 వెర్షన్‌ భారత మార్కెట్లో విడుదల అయింది. రూ. 12.05 లక్షల నుంచి ఈ బైక్ ధరలు ప్రారంభమవుతున్నాయి. మిగతా వివరాలు చూడండి.
2023 triumph bonneville speedmaster
2023 triumph bonneville speedmaster

2023 triumph bonneville speedmaster

భారతదేశంలో సాధారణ మోటార్ సైకిళ్లతో పాటు ఖరీదైన ఇంపొర్టెడ్ బైక్ లకు కూడా డిమాండ్ బాగానే ఉంది. ట్రయంఫ్, హార్లే డేవిడ్సన్ లాంటి లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీదారు భారతీయ మార్కెట్లో వరుసపెట్టి తమ బ్రాండ్ నుంచి మోటార్ సైకిళ్లను విడుదల చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

తాజాగా బ్రిటీష్ ఆటోమేకర్ ట్రయంఫ్ తమ బోనెవిల్లే స్పీడ్‌మాస్టర్ మోటార్‌సైకిల్ 2023 వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ దీని ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్-షోరూం వద్ద రూ. 12.05 లక్షలుగా ఉంది. కొద్దిగా రెట్రో లుక్ కలిగిన ఈ మోడ్రన్ స్పీడ్‌మాస్టర్ బైక్ సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పూర్తి-LED లైటింగ్ సెటప్‌తో అధునాతన ఫీచర్లతో వచ్చింది.

సరికొత్త బోనెవిల్లే స్పీడ్‌మాస్టర్ మోటార్‌సైకిల్ ఇప్పుడు మూడు రంగులలో లభిస్తుంది. జెట్ బ్లాక్, సఫైర్ బ్లాక్ విత్ ఫ్యూజన్ వైట్ అలాగే కార్డోవన్ రెడ్ అనే పెయింట్ స్కీముల్లో లభ్యమవుతోంది.

సరికొత్త బోనెవిల్లే స్పీడ్‌మాస్టర్ మోటార్‌సైకిల్ ఇప్పుడు మూడు రంగులలో లభిస్తుంది. జెట్ బ్లాక్, సఫైర్ బ్లాక్ విత్ ఫ్యూజన్ వైట్ అలాగే కార్డోవన్ రెడ్ అనే పెయింట్ స్కీముల్లో లభ్యమవుతోంది.

ఎంచుకునే కలర్ ఆప్షన్లను బట్టి ఈ బైక్ ధరల్లో మార్పులు ఉంటాయి. జెట్ బ్లాక్, కార్డోవన్ రెడ్ కలర్స్ సింగిల్-టోన్ ఫినిషింగ్‌ను కలిగి ఉండగా, ఫ్యూజన్ వైట్‌తో సఫైర్ బ్లాక్ అనేది డ్యూయల్-టోన్ థీమ్‌ను కలిగి ఉండటంతో ఇదే అత్యంత ఖరీదైన బైక్ ఆప్షన్ అవుతుంది.

జెట్ బ్లాక్ ధర: రూ. 12.05 లక్షలు

కార్డోవన్ రెడ్ ధర: రూ 12.18 లక్షలు

ఫ్యూజన్ వైట్‌తో సఫైర్ బ్లాక్ షేడ్ ధర: రూ. 12.35 లక్షలు

ఇంజన్ కెపాసిటీ, స్పెసిఫికేషన్స్

2023 ట్రయంఫ్ బోన్నెవిల్లే స్పీడ్‌మాస్టర్ మోటార్‌సైకిల్‌లో 1,200cc ప్యారలల్-ట్విన్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ఈ మోటార్ 6,100rpm వద్ద గరిష్టంగా 76.9hp శక్తిని అలాగే 4,000rpm వద్ద 106Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రయంఫ్ బోన్నెవిల్లే స్పీడ్‌మాస్టర్ ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటుగా రైడర్ భద్రత కోసం రైడ్-బై-వైర్ థొరెటల్, డ్యూయల్-ఛానల్ ABSలను అమర్చారు. ఈ బైక్‌పై సస్పెన్షన్ పరిశీలిస్తే..ముందు వైపున 47mm ఫోర్కులు, వెనుక వైపున మోనో-షాక్ యూనిట్‌ను కలిగి ఉంది.

డిజైన్ అంశలను పరిశీలిస్తే.. టియర్‌డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, స్ల్పిట్-స్టైల్ సీట్లు, పొడవాటి ఎగ్జాస్ట్, పిలియన్ గ్రాబ్ రైల్, రౌండ్ మిర్రర్‌లను కలిగి ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం