తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  2023 Triumph Bonneville।ట్రయంఫ్ నుంచి సరికొత్త స్ట్రీట్ బైక్ విడుదల, ధర ఎంతంటే..

2023 Triumph Bonneville।ట్రయంఫ్ నుంచి సరికొత్త స్ట్రీట్ బైక్ విడుదల, ధర ఎంతంటే..

HT Telugu Desk HT Telugu

04 August 2022, 14:49 IST

    • ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా 2023 Triumph Bonneville T120 బైక్ ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.11.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలు చూడండి..
Triumph Bonneville T120
Triumph Bonneville T120

Triumph Bonneville T120

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తమ బ్రాండ్ నుంచి రెండు కొత్త బైక్‌లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. కొత్తగా 2023 బోనెవిల్లే T100 బైక్‌ను లాంచ్ చేసిన కంపెనీ దీనికంటే కొద్దిగా మెరుగైన పనితీరు కలిగి ఉండే 2023 బోన్నెవిల్లే T120ని కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారత మార్కెట్లో Triumph Bonneville T120 ధర రూ. 11.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. T100 మోడల్ కంటే సుమారు రూ. 1.40 నుంచి రూ. 2 లక్షలు ఎక్కువ.

ట్రెండింగ్ వార్తలు

Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

T120 బైక్ ఒకే వేరియంట్లో లభ్యమవుతుంది, అయితే నాలుగు కలర్ స్కీములలో అందుబాటులో ఉంటుంది. ఆ ప్రకారంగా ధరల్లో కూడా మార్పు ఉంటుంది.

T120 బైక్ లభించే కలర్ ఆప్షన్లలో పరిశీలిస్తే జెట్ బ్లాక్, సిల్వర్ ఐస్‌తో కార్డోవన్ రెడ్, సిల్వర్ ఐస్‌తో కోబాల్ట్ బ్లూ, ఫ్యూజన్ వైట్‌తో ఏజియన్ బ్లూ ఉన్నాయి. ఇందులో జెట్ బ్లాక్ కలర్ సింగిల్-టోన్ లో వస్తుంది, ఇదే జాబితాలో అత్యంత సరసమైన పెయింట్ థీమ్. ఇతర పెయింట్ ఆప్షన్లు డ్యూయల్-టోన్ ఫినిషింగ్ కలిగ్ ఉంటాయి కాబట్టి జెట్ బ్లాక్ కలర్ కంటే ఎక్కువ ధరను కలిగి ఉన్నాయి. ధరలను దిగువన చూడండి:

జెట్ బ్లాక్: రూ. 11.09 లక్షలు

కార్డోవన్ రెడ్ విత్ సిల్వర్ ఐస్: రూ. 11.39 లక్షలు

కోబాల్ట్ బ్లూ విత్ సిల్వర్ ఐస్: రూ. 11.39 లక్షలు

ఏజియన్ బ్లూ విత్ ఫ్యూజన్ వైట్: రూ. 11.39 లక్షలు

Triumph Bonneville T120 స్పెసిఫికేషన్లు

Triumph Bonneville T120లో BS6-అనుగుణమైన 1,200cc ప్యారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దీనిని 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించారు. ఈ మోటారు 6,550rpm వద్ద 78.9bhp శక్తిని, అలాగే 3,500rpm వద్ద 105Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

మోటార్‌సైకిల్‌లోని ఇతర హార్డ్‌వేర్‌ అంశాలను పరిశీలిస్తే ట్విన్-క్రెడిల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ స్ప్రింగ్‌లు, ముందువైపు డ్యూయల్ డిస్క్‌లు, వెనుకవైపు ఒక రోటర్ ఇచ్చారు.

డిజైన్‌ పరిశీలిస్తే గుండ్రని హెడ్‌లైట్, టియర్-డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, మౌంటెడ్ క్రోమ్ ఫిల్లర్ క్యాప్, సింగిల్-పీస్ సీట్, ట్విన్-సైడ్ ఎగ్జాస్ట్ క్యానిస్టర్‌లు ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం