తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijayasai Reddy On Cinema Industry: వార‌సులే హీరోలు అయ్యే సంస్కృతి పోవాలి - వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కామెంట్స్‌

Vijayasai Reddy On Cinema Industry: వార‌సులే హీరోలు అయ్యే సంస్కృతి పోవాలి - వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కామెంట్స్‌

HT Telugu Desk HT Telugu

28 July 2023, 5:53 IST

  • Vijayasai Reddy On Cinema Industry: సినీ ప‌రిశ్ర‌మ‌లోని వార‌స‌త్వ సంస్కృతిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. అగ్ర న‌టీన‌టులు త‌న‌యులు హీరోలు అయ్యే విధానం మారాల‌ని సూచించాడు.

విజ‌య‌సాయిరెడ్డి
విజ‌య‌సాయిరెడ్డి

విజ‌య‌సాయిరెడ్డి

Vijayasai Reddy On Cinema Industry: ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోల్లో చాలా మంది వార‌స‌త్వంతో అడుగుపెట్టిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండ‌స్ట్రీల‌లో ఇదే సంస్కృతి క‌నిపిస్తుంటుంది. ఈ వార‌స‌త్వ ధోర‌ణిపై వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. సినిమాటోగ్ర‌ఫీ స‌వ‌ర‌ణ బిల్లుకు సంబంధించి రాజ్య‌స‌భ‌లో విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తిభ‌కు కొద‌వ‌లేద‌ని, కానీ వార‌స‌త్వ హీరోల కార‌ణంగా ప్ర‌తిభావంతులైన క‌ళాకారుల‌కు స‌రైన అవ‌కాశాలు ద‌క్క‌డం విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Krishna mukunda murari serial: కృష్ణకి పట్టపగలే చుక్కలు చూపిస్తానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన తింగరి

Guppedantha Manasu Serial: యాక్టింగ్‌లో వ‌సుధార‌ను మించిన‌ శైలేంద్ర - మోస‌పోయిన రాజీవ్ - మ‌ను కోసం రిషి భార్య రిస్క్‌

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. నరసింహకు కార్తీక్ స్ట్రాంగ్ వార్నింగ్.. దీపతో మొండిగా వాదించిన శౌర్య

Brahmamudi May 16th Episode: అత్తింట్లో అనామిక పంచాయితీ - క‌ళ్యాణ్ కోసం ఒక్క‌టైన దుగ్గిరాల కుటుంబం - రాజ్‌కు షాక్‌

అగ్ర క‌థానాయ‌కులు, న‌టీన‌టులు కొడుకులు హీరోలు అయ్యే సంస్కృతి తొల‌గిపోవాల‌ని పేర్కొన్నాడు. టాలెంట్‌కు ప‌ట్టం క‌ట్టేలా సినీ ప‌రిశ్ర‌మలో మార్పులు జ‌ర‌గాల‌ని సూచించారు. హీరోల రెమ్యున‌రేష‌న్స్‌పై కూడా విజ‌య‌సాయిరెడ్డి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. పెద్ద‌ సినిమాల బ‌డ్జెట్‌లో 75 శాతం వాటా హీరోల రెమ్యున‌రేష‌న్స్‌ ఉంటున్నాయ‌ని, స్టార్ హీరోలు వంద‌ల కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్స్ తీసుకుంటున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపాడు.

సినీ ప‌రిశ్ర‌మ‌ను న‌మ్ముకున్న‌ ల‌క్ష‌లాది కార్మికుల‌కు అరాకోరా వేత‌నాలే అందుతోన్నాయ‌ని పేర్కొన్నారు. సినీ ప‌రిశ్ర‌మ వ‌ల్ల ఎక్కువ‌గా హీరోలు మాత్ర‌మే ల‌బ్ధిపోతున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నాడు. అంద‌రికి ప్ర‌యోజ‌నం చేకూరేలా సినిమాటోగ్ర‌ఫీ స‌వ‌ర‌ణ చ‌ట్టంలో మార్పులు తీసుకొస్తే బాగుంటుద‌ని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నాడు. సినిమాటోగ్ర‌ఫీ స‌వ‌ర‌ణ బిల్లుకు రాజ్య‌స‌భ్య ఆమోదం తెలిపింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఉద్దేశించేనా?

వారాహి విజ‌య‌యాత్ర‌లో బ్రో సినిమా కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రోజుకు రెండు కోట్ల చొప్పున రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు. ఈ విష‌యాన్ని వారాహి విజ‌య‌యాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. బ్రో సినిమా బ‌డ్జెట్ వంద కోట్ల క‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెమ్యున‌రేష‌న్ దాదాపు న‌ల‌భై ఐదు కోట్లు కావ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ పారితోషికాన్ని ఉద్దేశించే ఇన్‌డైరెక్ట్‌గా విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌స‌భ‌లో రెమ్యున‌రేష‌న్స్‌పై కామెంట్స్ చేసిన‌ట్లు స‌మాచారం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం