తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajal Aggarwal: భ‌గ‌వంత్ కేస‌రి యూనిట్‌పై కాజ‌ల్ గుస్సా - స‌క్సెస్ మీట్‌కు దూరం అందుకేనా?

Kajal Aggarwal: భ‌గ‌వంత్ కేస‌రి యూనిట్‌పై కాజ‌ల్ గుస్సా - స‌క్సెస్ మీట్‌కు దూరం అందుకేనా?

HT Telugu Desk HT Telugu

10 November 2023, 12:54 IST

  • Kajal Aggarwal: గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన భ‌గ‌వంత్ కేస‌రి స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌లేదు. సినిమా యూనిట్‌పై అసంతృప్తితోనే ఈ వేడుక‌ల‌కు కాజ‌ల్ దూరంగా ఉంటోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది

కాజ‌ల్ అగ‌ర్వాల్
కాజ‌ల్ అగ‌ర్వాల్

కాజ‌ల్ అగ‌ర్వాల్

Kajal Aggarwal: భ‌గ‌వంత్ కేస‌రి సినిమా స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో బాల‌కృష్ణ‌, శ్రీలీల‌తో పాటు సినిమా యూనిట్ మొత్తం పాల్గొన్నారు. కానీ హీరోయిన్ కాజ‌ల్ మాత్రం ఈ వేడుక‌ల్లో క‌నిపించ‌లేదు. ఇదే కాదు గ‌త కొద్ది రోజులుగా భ‌గ‌వంత్ కేస‌రి ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా బాల‌కృష్ణ‌, శ్రీలీల‌తో పాటు సినిమా టీమ్ తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించింది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

కొన్ని ఈవెంట్స్‌ను నిర్వ‌హించింది వాటిలో కాజ‌ల్ క‌నిపించ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రిలీజ్‌కు ముందు ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న కాజ‌ల్ రిలీజ్ త‌ర్వాత మాత్రం ఒక్క వేడుక‌లో క‌నిపించ‌డం లేదు. భ‌గ‌వంత్ కేస‌రి టీమ్‌పై అసంతృప్తితోనే కాజ‌ల్ ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉంటోన్న‌ట్లు చెబుతోన్నారు. ఈ సినిమా 125 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే స‌క్సెస్ క్రెడిట్ ఎక్కువ‌గా హీరో బాల‌కృష్ణ తో పాటు శ్రీలీల‌కే వెళ్లింది.

కాజ‌ల్ ఈ సినిమాతో పెద్ద‌గా ఒరిగిందేమి లేదు. మ‌రోవైపు హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు ఇంపార్టెన్స్ లేద‌ని తెలిసి కూడా కాజ‌ల్ తానే ఈ సినిమా చేస్తాన‌ని ముందుకొచ్చింద‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి భగవంత్ కేసరి ప్రమోషన్స్‌లో వెల్ల‌డించ‌డం కూడా కాజ‌ల్ అసంతృప్తికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. రిలీజ్ త‌ర్వాత ప్ర‌మోష‌న్స్‌లో కాజ‌ల్ పేరును పెద్ద‌గా ప్ర‌స్తావించ‌ని టీమ్‌ మ‌రోవైపు శ్రీలీల‌పై పోటీప‌డి ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో కాజ‌ల్ కోపానికి కార‌ణ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అందుకే భ‌గ‌వంత్ కేస‌రి స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌కు కాజ‌ల్ దూరంగా ఉన్న‌ట్లు చెబుతోన్నారు. హైద‌రాబాద్‌లో ఉండి కూడా ఆమె ఈ స‌క్సెస్ వేడుక‌ల‌కు హాజరు కాలేదని స‌మాచారం. ఇదివ‌ర‌కు ఆచార్య విష‌యంలో కాజ‌ల్‌కు అన్యాయం జ‌రిగింది.

సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యిన త‌ర్వాత కాజ‌ల్ సీన్స్‌ను సినిమా నుంచి తొల‌గించాడు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. భగవంత్ కేసరితో మరోసారి ఇంచు మించు అలాంటి అనుభవమే ఎదురైంది. మ‌రోవైపు కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించిన స‌త్య‌భామ మూవీ టీజ‌ర్ శుక్ర‌వారం రిలీజైంది. ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కాజ‌ల్ క‌నిపిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం