తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahaan | తండ్రీకొడుకులు న‌టించిన తొలి సినిమా Ottలోకి..అదరగోడుతున్న టీజర్

mahaan | తండ్రీకొడుకులు న‌టించిన తొలి సినిమా OTTలోకి..అదరగోడుతున్న టీజర్

31 January 2022, 14:27 IST

    • కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన మహాన్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఫిబ్రవరి 10న విడుదలకానుంది. టీజర్‌ను సోమవారం చిత్రబృందం విడుదలచేసింది. మద్యపానాన్ని నిషేధించాలని పోరాటం సాగించే కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా విక్రమ్ టీజర్ ఆరంభంలో కనిపించారు.
Mahaan teaser
Mahaan teaser

Mahaan teaser

మద్యపానాన్ని నిషేధించాలని, నాటు సారా దుకాణాలను మూసివేయాలని హీరో విక్రమ్ పిలుపునిచ్చారు. విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ’మహాన్‘ ప్రచారంలో ఈ పిలుపునిచ్చారు హీరో విక్రమ్ . కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఫిబ్రవరి 10న విడుదలకానుంది. టీజర్‌ను సోమవారం చిత్రబృందం విడుదలచేసింది. మద్యపానాన్ని నిషేధించాలని పోరాటం సాగించే కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా విక్రమ్ టీజర్ ఆరంభంలో కనిపించారు. ఆ తర్వాత మద్యం సిండికేట్ నాయకుడిగా అతడిని దర్శకుడు చూపించారు. 

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

టీజర్ లో మాస్ కోణంలో నెగెటివ్ షేడ్స్ తో పవర్ ఫుల్‌గా విక్రమ్ పాత్ర సాగింది. విక్రమ్ పేరును సినిమాలో గాంధీ మహాన్ గా చూపించడం ఆసక్తిని పంచుతుంది. ఈ టీజర్ లో ధృవ్ విక్రమ్ ముఖాన్ని చూపించలేదు. ’ఆదిత్య వర్మ‘ సినిమా ద్వారా ధృవ్ విక్రమ్ హీరోగా అరంగేట్రం చేశారు. ’అర్జున్ రెడ్డి‘కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాతో ధృవ్ విక్రమ్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. తండ్రీకొడుకులు విక్రమ్, ధృవ్ విక్రమ్ కలయికలో తొలిసారి రూపొందుతున్న ’మహాన్‘ సినిమాపై తమిళనాడుతో పాటు తెలుగులో భారీ అంచనాలు నెలకొన్నాయి. సిమ్రాన్, వాణి భోజన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. తొలుత ఈ సినిమాను డిసెంబర్ నెలలో థియేటర్లలో విడుదలచేయాలని భావించారు. కానీ కరోనా మహమ్మారి ప్రభావంతో ఓటీటీకే నిర్మాతలు మొగ్గు చూపారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం