తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Athidhi Web Series: అతిథి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న స్వ‌యంవ‌రం హీరో వేణు

Athidhi Web Series: అతిథి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న స్వ‌యంవ‌రం హీరో వేణు

HT Telugu Desk HT Telugu

30 August 2023, 12:37 IST

  • Athidhi Web Series: స్వ‌యంవ‌రం హీరో వేణు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫ‌స్ట్ టైమ్ హార‌ర్ క‌థాంశంతో అతిథి అనే వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. ఈ వెబ్‌సిరీస్ ఏ ఓటీటీలో, ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

వేణు
వేణు

వేణు

Athidhi Web Series: స్వ‌యంవ‌రం హీరో వేణు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫ‌స్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. హార‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ అతిథి అనే పేరును ఖ‌రారు చేశారు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో సెప్టెంబ‌ర్ 19 నుంచి ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్‌సిరీస్ టీజ‌ర్‌ను బుధ‌వారం రిలీజ్ చేశారు. ఓ పురాత‌న భ‌వంతి నేప‌థ్యంలో ఈ హార‌ర్ సిరీస్ సాగ‌నుంది. వర్షంలో భ‌వంతిలోకి అడుగుపెట్టిన ఓ యువ‌తి రాత్రి పూట ఇక్క‌డ ఉండొచ్చా అని అడగ‌టం ఈ టీజ‌ర్‌లో క‌నిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

NTR Neel Update: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై కీలక అప్‍డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పటి నుంచో చెప్పిన టీమ్

OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం సినీ పండుగ.. ఏకంగా 21 సినిమాలు.. కానీ 2 మాత్రమే చూడదగినవి.. ఏంటంటే?

Payal Rajput: వారు వేదిస్తున్నారు: లీగల్ యాక్షన్‍కు రెడీ అయిన పాయల్ రాజ్‍పుత్

Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

హార‌ర్‌, రొమాన్స్‌, స‌స్పెన్స్ అంశాల‌తో ఆస‌క్తిక‌రంగా అతిథి టీజ‌ర్ సాగింది. ఈ వెబ్‌సిరీస్‌లో వేణు తొట్టెంపూడితో పాటు అవంతికా మిశ్రా ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ సిరీస్‌కు ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని వెల్ల‌డించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

స్వ‌యంవ‌రం, హ‌నుమాన్ జంక్ష‌న్‌, పెళ్లాం ఊరెళితే లాంటి కామెడీ మూవీస్‌తో హీరోగా మంచి విజ‌యాల్ని అందుకున్నాడు వేణు. ద‌మ్ము, చింత‌కాయ‌ల‌ర‌వితో పాటు స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించారు.

2013లో రిలీజై రామాచారి త‌ర్వాత సినిమాల‌కు సుదీర్ఘ కాలం బ్రేక్ తీసుకున్న వేణు గ‌త ఏడాది ర‌వితేజ హీరోగా న‌టించిన రామారావు ఆన్ డ్యూటీ తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో వేణు న‌టించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం