తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mega 156: మెగాస్టార్ నయా మూవీ బడ్జెట్ అన్ని కోట్లా?

Mega 156: మెగాస్టార్ నయా మూవీ బడ్జెట్ అన్ని కోట్లా?

24 October 2023, 21:49 IST

    • Mega 156: మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ బయటికి వచ్చింది. కళ్లు చెదిరే బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే.
మెగా156 పూజా కార్యక్రమంలో చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, డైరెక్టర్ వశిష్ట
మెగా156 పూజా కార్యక్రమంలో చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, డైరెక్టర్ వశిష్ట

మెగా156 పూజా కార్యక్రమంలో చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, డైరెక్టర్ వశిష్ట

Mega 156: మెగాస్టార్ చిరంజీవి తదుపరి సోషయో ఫ్యాంటసీ సినిమా చేస్తున్నారు. బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి విశిష్ట దర్శకత్వంలో భారీ స్థాయిలో ఈ మూవీ ఉండనుంది. తొలుత మెగా 157గా ప్రకటించిన ఈ చిత్రం.. ఇప్పుడు మెగా 156గా మారింది. ఇది మెగాస్టార్‌ చిరంజీవికి 156వ చిత్రంగా ఉంది. ఈ మెగా156 పూజా కార్యక్రమాలు సోమవారమే జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నేడు రిలీజ్ చేసింది మూవీ యూనిట్. దీంతో మెగా156 మొదలైంది. కాగా, ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన బజ్ బయటికి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: ప్ర‌భాస్ చేతుల మీదుగా మొద‌లై రిలీజ్ కానీ దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?

Abhay Movie: థియేట‌ర్ల‌లో రిలీజైన 23 ఏళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన క‌మ‌ల్‌హాస‌న్ సైకో థ్రిల్ల‌ర్ మూవీ!

Brahmamudi May 18th Episode: బ్రహ్మముడి- కిడ్నాపర్ల నుంచి బయటపడిన కావ్య.. భార్యను కొట్టబోయిన రాజ్.. మరదలిపై ఫైర్

మెగా156 సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. పంచభూతాల నేపథ్యంలో సోషియో ఫ్యాంటసీ చిత్రంగా ఇది ఉంటుందని ఫస్ట్ లుక్ ద్వారానే తెలిసిపోయింది. అయితే, మెగా156 సినిమా భారీ బడ్జెట్‍తో తెరకెక్కనుందని తాజాగా సమాచారం చక్కర్లు కొడుతోంది. రూ.200 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందనుందని బజ్ బయటికి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మెగా156 సినిమాలో గ్రాఫిక్స్ ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే సీజీ వర్క్స్ కోసమే ఎక్కువ భాగం ఖర్చవుతుందని టాక్. అందుకే ఈ చిత్రం బడ్జెట్ ఈ స్థాయిలో ఉండనుందని బజ్ నడుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం ఉండనుంది. ఇక, మెగా156లో విలన్ పాత్ర కోసం హీరో దగ్గుబాటి రానాతో మూవీ యూనిట్ చర్చలు జరుపుతున్నట్టుగా కూడా టాక్ బయటికి వచ్చింది. అయితే, ఈ విషయాలపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.

మెగా156 సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పాట రికార్డింగ్‍తోనే ఈ మూవీ మొదలైంది. ఈ సినిమాలో ఆరు పాటలు ఉంటాయని కూడా కీరవాణి చెప్పారు. వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

మెగా156 సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్‍గా నటిస్తారని కూడా కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే చిరంజీవి మినహా మెగా156 సినిమా విషయంలో ఇతర నటీనటుల వివరాలను మూవీ యూనిట్ ప్రకటించలేదు. పాన్ ఇండియా రేంజ్‍లో రూపొందనుండటంతో ఇతర ఇండస్ట్రీలకు చెందిన కొందరు స్టార్ నటీనటులను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్టు టాక్.

కాగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ సూపర్ హిట్ అయింది. అయితే, ఆగస్టులో విడుదలైన భోళా శంకర్ చిత్రం నిరాశపరిచింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం