Mega 156 Update: సక్సెస్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్‌ను రంగంలోకి దింపిన చిరు - మెగా 156 షురూ
Mega 156 Update: దసరా కానుకగా చిరంజీవి 156వ సినిమా అఫీషియల్‌గా మొదలైంది. చిరంజీవి సతీమణి సురేఖ చేతుల మీదుగా ఈ సినిమా మొదలైంది. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న మెగా 156 మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.
Mega 156 Update: దసరా రోజు మెగా అభిమానులకు గుడ్‌న్యూస్ వినిపించాడు చిరంజీవి. అతడి 156వ సినిమా అఫీషియల్‌గా ప్రారంభమైంది. సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సోమవారం యూవీ క్రియేషన్స్ కార్యాలయంలో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమాలకు చిరంజీవి సతీమణి సురేఖ ముఖ్య అతిథిగా హాజరైంది.
దర్శకనిర్మాతలకు సురేఖ స్క్రిప్ట్ అందజేసింది. అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, వీవీ వినాయక్, మారుతితో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. మెగా 156కి ఆస్కార్ విన్నర్స్ కీరవాణి సంగీతాన్ని అందిస్తోండగా...చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చబోతున్నారు. ఈ సినిమాకు బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కు కీరవాణి, చంద్రబోస్, సాయిమాధవ్ బుర్రా పనిచేశారు. అదే టీమ్ ఇప్పుడు మెగా 156 కోసం రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.
భోళా శంకర్ డిజాస్టర్ కావడం, ఆ సినిమా మ్యూజిక్, కథ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మెగా 156 విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకుంటోన్నట్లు సమాచారం. సోమవారం నుంచి ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. చిరంజీవి మూవీలో ఆరు పాటలు ఉంటాయని కీరవాణి తెలిపాడు. ఈ సినిమాకు ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. మెగా 156 సినిమాలో హీరోయిన్‌గా అనుష్క, మృణాల్ ఠాకూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తోన్నాయి.