తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krithi Shetty: ‘నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలిలే’.. బాయ్స్ కృతి బాధను అర్థం చేసుకోండి

Krithi Shetty: ‘నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలిలే’.. బాయ్స్ కృతి బాధను అర్థం చేసుకోండి

09 July 2022, 6:41 IST

    • 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి పోస్ట్ చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. తనకు ఓ బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ ఈ ముద్దుగుమ్మ ట్విటర్ వేదికగా అభిమానులను కోరింది. ప్రస్తుతం ఈ పోస్టుకు నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
కృతి శెట్టి
కృతి శెట్టి (Twitter)

కృతి శెట్టి

తొలి సినిమాతోనే తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది కృతి శెట్టి. 'ఉప్పెన'లా వచ్చి కుర్రాళ్ల గుండెలను ముంచేసిన ఈ బ్యూటీ.. వరుసపెట్టి సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్‌ హోదా అందుకునే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో మెరిసిన కృతి.. త్వరలో రామ్ సరసన ది వారియర్ చిత్రంలో కనిపించనుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన ట్విటర్ వేదికగా ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తనకు ఓ బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

"నాకు ఒక బాయ్‌ఫ్రెండ్ కావాలి. ఎవరైన అందమైన అబ్బాయిలు ఉంటే ట్యాగ్ చేయండి" అంటూ కృతి శెట్టి తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు లైక్లు, కామెంట్లతో విశేషంగా స్పందిస్తున్నారు.

కృతి ఈ విధంగా తన మనస్సులో మాటలను పంచుకోవడం ఇదే మొదటి సారి కాదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. తనకు అబద్దాలు ఆడే వారంటే అస్సలు ఇష్టముండద. ఏ విషయాన్నైనా దాపరికం లేకుండా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానిస్తానని చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి బాయ్‌ఫ్రెండ్ కావాలని ఏకంగా ట్విటర్ వేదికగానే అడిగేసింది.

ఉప్పెనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లోనూ తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం రామ్ పోతినేని సరసన లింగుసామి దర్శకత్వంలో చేసిన ది వారియర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

ఈ చిత్రాలు కాకుండాకృతి శెట్టి నితిన్‌తో మాచర్ల నియోజకవర్గం.. సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి ప్రాజెక్టులను చేస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని చిత్రాలు చర్చల దిశలో ఉన్నాయి. త్వరలోనే వీటిపైన అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం