తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Indian Idol 2 Finalists: తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనలిస్టును పరిచయం చేసిన తమన్.. ఎవరంటే?

Telugu Indian Idol 2 Finalists: తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనలిస్టును పరిచయం చేసిన తమన్.. ఎవరంటే?

21 May 2023, 21:32 IST

    • Telugu Indian Idol 2 Finalists: ప్రముఖ ఆహా ఓటీటీ షోలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రాండ్ ఫినాలేకు ఎంపికైన ఫైనలిస్టులు ఎవరో ఈ షో జడ్జీ తమన్ పరిచయం చేశారు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫైనలిస్టులతో తమన్ సహా ఆహా బృందం
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫైనలిస్టులతో తమన్ సహా ఆహా బృందం

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫైనలిస్టులతో తమన్ సహా ఆహా బృందం

Telugu Indian Idol 2 Finalists: ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ ఎంత పెద్ద హట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ 1కు ప్రేక్షకుల నుంచి విపరీతంగా ఆదరణ రావడంతో సీజన్-2ను తీసుకొచ్చారు. ఇప్పుడు ఇండియన్ ఐడల్ సీజన్-2కు అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ రెండో సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఇందులో భాగంగా గ్రాండ్ ఫినాలేలో అడుగుపెడుతున్నట్లు ఈ షో జడ్జీలు తమన్, కార్తిక్, గీతా మాధురి ప్రకటించారు. అంతేకాకుండా ఫైనలిస్టులను కూడా ఎంపిక చేశారు.

ట్రెండింగ్ వార్తలు

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

ఇండియన్ ఐడల్ సీజన్-2లో ఫైనలిస్టులుగా కార్తికేయ, శృతి, జయరాం, లాస్య, సౌజన్య భాగవతుల ఎంపికయ్యారు. తమదైన గాత్రంతో అద్భుతంగా పాడి ఫైనల్ స్టేజ్ వరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తమన్ సహా, కార్తిక్, గీతా మాధురి తమ స్పందనను తెలియజేశారు.

ముందుగా కార్తిక్ మాట్లాడుతూ.. "ఇండియన్ ఐడల్ జర్నీని ఎప్పటికీ మర్చిపోలేను. తమన్ గారితో మంచి అనుబంధం ఉంది. ఈ షో వల్ల అది ఇంకా బలపడింది. చాలా ఎంజాయ్ చేశాం. మర్చిపోలేని అనుభవాలను సొంతం చేసుకున్నాను. ఇదింకా కొనసాగుతుందని భావిస్తున్నాను. అని అన్నారు.

అనంతరం గీతా మాధురి మాట్లాడుతూ.. "ఈ షోలో జడ్జీగా చేయడం నాకు ఇంకా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇంత మంచి జర్నీని నాకు అందించిన గురువులు, తల్లిదండ్రులు, ఆహా టీమ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంత మంచి టీమ్ కుదరడం వల్ల ఇండియన్ ఐడల్ బాగా సక్సెస్ అయింది" అని గీతా మాధురి స్పష్టం చేసింది.

ఇండియన్ ఐడల్ 2కు హోస్ట్‌గా వ్యవహరించిన హేమచంద్ర మాట్లాడుతూ.. "ఈ షో కంటే ముందు చాలా ప్రోగ్రామ్స్ చేశాను. కానీ ఇది మాత్రం చాలా డిరెంట్. నాలోని కొత్త కొణన్ని ఆవిష్కరించింది. ఆడిషన్స్ నుంచి చూస్తే మంచి ప్రతిభావంతులను ఆహా టీమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. అనేక దశలను దాటుకుని ఫైనల్ స్టేజ్‌కు ఈ ప్రోగ్రామ్ చేరుకుంది." అని హేమచంద్ర అన్నారు.

తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథి పాన్ ఇండియా హీరో హాజరవుతున్నారు. ఆయన ఎవరో కాదు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని తెలుస్తోంది. ఈ విషయంపై ఆహా ఇటీవలే ట్విటర్ వేదకగా హింట్ కూడా ఇచ్చింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం