తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lord Ram Movies In Ott: లవకుశ నుంచి ఆదిపురుష్ వరకు.. అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ రామాయణంపై వచ్చిన ఈ సినిమాలు చూడండి

Lord Ram Movies in OTT: లవకుశ నుంచి ఆదిపురుష్ వరకు.. అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ రామాయణంపై వచ్చిన ఈ సినిమాలు చూడండి

Hari Prasad S HT Telugu

22 January 2024, 9:19 IST

    • Telugu Movies on Lord Ram: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ తెలుగులో రాముడిపై వచ్చిన లవకుశ నుంచి ఆదిపురుష్ వరకు సినిమాలు చూస్తూ రామనామ స్మరణలో మునిగి తేలండి.
తెలుగులో రాముడిపై వచ్చిన సినిమాలు
తెలుగులో రాముడిపై వచ్చిన సినిమాలు

తెలుగులో రాముడిపై వచ్చిన సినిమాలు

Telugu Movies on Lord Ram: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సోమవారం (జనవరి 22) జరగబోతోంది. ఈ నేపథ్యంలో దేశమంతా రామనామ స్మరణతో మార్మోగిపోతోంది. ఎంత విన్నా, చూసినా తరగని రామాయణంపై తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.

ట్రెండింగ్ వార్తలు

Malayalam Movie: వామ్మో ఇదేం టైటిల్‌ -ఈ కొత్త మ‌ల‌యాళం మూవీ పేరు చెప్ప‌డానికి నోరు తిర‌గ‌డం క‌ష్ట‌మే!

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

ఈ మరుపురాని వేళ ఈ సినిమాలు చూస్తూ మీరు కూడా రామనామ స్మరణ చేసుకోండి. తెలుగులో గత ఆరు దశాబ్దాల కాలంలో శ్రీరాముడు, రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఆ మూవీస్ ఇప్పుడు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.

లవకుశ (1963) - అమెజాన్ ప్రైమ్ వీడియో

ఎన్టీఆర్, అంజలీ దేవి నటించిన ఈ లవకుశ మూవీ తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడటంలో సందేహం లేదు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

సంపూర్ణ రామాయణం (1958, 1961, 1971)

వాల్మీకి రామాయణం ఆధారంగా సంపూర్ణ రామాయణం పేరుతో తెలుగులో మూడు సినిమాలు రూపొందాయి. తొలి సినిమా 1958లో ఎన్టీఆర్ నటించాడు. ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

ఇక 1961లో బాలీవుడ్ లో సంపూర్ణ రామాయణం పేరుతో రూపొందిన సినిమా తెలుగులోనూ వచ్చింది. ఈ మూవీ కూడా యూట్యూబ్ లో చూడొచ్చు. 1971లో శోభన్ బాబు, బాపు కాంబినేషన్ లో మరో సంపూర్ణ రామాయణం రూపొందింది. ఈ సినిమాను యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు.

శ్రీరామరాజ్యం (2011) - ప్రైమ్ వీడియో, ఆహా

2011లో బాలకృష్ణ నటించిన ఈ శ్రీ రామరాజ్యం సినిమాను బాపు డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఆహాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నయనతార సీతగా నటించింది.

బాల రామాయణం (1996) - యూట్యూబ్

జూనియర్ ఎన్టీఆర్ బాల రాముడిగా కనిపించిన ఈ బాల రామాయణం మూవీ 1996లో వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది.

సీతా కల్యాణం (1976) - యూట్యూబ్

బాపు డైరెక్షన్ లో జయప్రద నటించిన సీతా కల్యాణం మూవీ కూడా అప్పట్లో ఓ పెద్ద హిట్ సాధించింది. రామాయణాన్ని కొత్తగా చూపించిన సినిమా ఇది. ఈ మూవీని యూట్యూబ్ లో చూడొచ్చు.

భూకైలాస్ (1958) - ప్రైమ్ వీడియో, యూట్యూబ్

రామాయణాన్ని రావణుడి దృక్పథంలో చెప్పిన సినిమా భూకైలాస్. ఇందులో ఎన్టీఆర్ రావణాసురుడిగా నటించాడు. కర్ణాటకలోని గోకర్ణ స్థలపురాణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లలో అందుబాటులో ఉంది.

ఆదిపురుష్ (2023) - ప్రైమ్ వీడియో

గతేడాది ప్రభాస్, కృతిసనన్ నటించిన ఆదిపురుష్ మూవీ కూడా రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాపై దారుణమైన విమర్శలు వచ్చినా.. రామాయణాన్ని ఈ కాలం పిల్లలకు తగినట్లుగా రూపొందించానని దర్శకుడు ఓంరౌత్ సమర్థించుకున్నాడు. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఇవే కాకుండా శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం, మణిరత్నం రావణ్ మూవీస్ కూడా ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం