తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamannah Vijay Wedding: తమన్నా, విజయ్ పెళ్లి.. త్వరలోనే గుడ్ న్యూస్

Tamannah Vijay Wedding: తమన్నా, విజయ్ పెళ్లి.. త్వరలోనే గుడ్ న్యూస్

Hari Prasad S HT Telugu

15 November 2023, 11:37 IST

    • Tamannah Vijay Wedding: తమన్నా, విజయ్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ డిసెంబర్ లోనే రానున్నట్లు తెలుస్తోంది.
తమన్నా, విజయ్ వర్మ
తమన్నా, విజయ్ వర్మ

తమన్నా, విజయ్ వర్మ

Tamannah Vijay Wedding: తమన్నా, విజయ్ వర్మ తమ డేటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకోబోతున్నారా? త్వరలోనే ఈ జంట ఏడడుగులూ నడవబోతోందా? ప్రస్తుతం వస్తున్న వార్తలు ఇదే నిజమంటున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లితో ఒక్కటి కావడం సహజమే. ఇప్పుడీ లైన్ లో తమన్నా, విజయ్ ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

కొన్నాళ్లుగా తమన్నా, విజయ్ డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లు తమ రిలేషన్‌షిప్ ను ఎక్కువ కాలం సీక్రెట్ గా కూడా ఉంచలేదు. ఎప్పుడో పబ్లిగ్గా చెప్పేసిన ఈ జంట.. అప్పటి నుంచి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. ఈ ఏడాది జూన్ లో తమ డేటింగ్ రూమర్స్ నిజమే అని కన్ఫమ్ చేశారు తమన్నా, విజయ్. ఇప్పటికే ఇద్దరూ 30లు దాటేశారు.

ఇక లేట్ చేయకుండా పెళ్లి చేసుకోవడమే బెటరని ఇద్దరూ డిసైడైనట్లు సమాచారం. డిసెంబర్ లోనే వీళ్లు తమ పెళ్లి గురించి అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. నార్త్ నుంచి టాలీవుడ్ లోకి వచ్చి ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది తమన్నా. ఇటు హైదరాబాద్ లో పుట్టి బాలీవుడ్ వెళ్లి సత్తా చాటుతున్నాడు విజయ్ వర్మ.

ఈ ఇద్దరూ రిలేషన్‌షిప్ లో ఉన్నారంటూ మొదట్లో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. మిల్కీ బ్యూటీలాంటి తమన్నా.. విలన్ క్యారెక్టర్లు పోషించే విజయ్ తో డేటింగ్ ఏంటనీ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. తొలిసారి వీళ్లిద్దరూ గోవాలో న్యూ ఇయర్ పార్టీలో కనిపించారు. అప్పటి నుంచే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. మొత్తానికి ఆరు నెలల తర్వాత వీళ్లు తమ మధ్య బంధాన్ని బయటపెట్టారు.

లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీలో ఈ ఇద్దరూ రెచ్చిపోయి నటించారు. రెండు దశాబ్దాల సినిమా కెరీర్లో ఎప్పుడూ ఘాటు ముద్దు సీన్లు చేయని తమన్నా.. తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ కోసం ఆ రూల్ పక్కన పెట్టింది. ఇందులో చాలా బోల్డ్ సీన్ చేసింది. ఇక వీళ్ల డేటింగ్ చాలని, పెళ్లి చేసుకోవాలని ఇద్దరి కుటుంబాల నుంచి ఒత్తిడి వస్తోందట. వచ్చే నెలలో 21వ తేదీన తమన్నా బర్త్ డే జరుపుకుంటోంది. అదే రోజు వీళ్లు తమ పెళ్లి అనౌన్స్‌మెంట్ చేయనున్నట్లు సమాచారం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం