తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Varma: బాగా ఎంజాయ్ చేశారా అంటూ విజయ్‍కు ప్రశ్న.. తమన్నా బాయ్‍ఫ్రెండ్ ఏం చేశాడంటే?

Vijay Varma: బాగా ఎంజాయ్ చేశారా అంటూ విజయ్‍కు ప్రశ్న.. తమన్నా బాయ్‍ఫ్రెండ్ ఏం చేశాడంటే?

Sanjiv Kumar HT Telugu

01 September 2023, 14:23 IST

  • Vijay Varma Angry: సినీ ఇండస్ట్రీలో లవ్ ట్రాక్స్, ఫారెన్ వెకేషన్స్ బాలీవుడ్‍లో సర్వసాధారణం. అయితే సెలబ్రిటీలు ఎలాంటి రిలేషన్స్ లో ఉన్నా కొన్ని ప్రశ్నలకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. దాంతో వాళ్లు ఏం చేస్తారో ఊహించలేం. అలా తాజాగా విజయ్ వర్మ చేసిన పని వైరల్ అవుతోంది.

తమన్నా విజయ్ వర్మ
తమన్నా విజయ్ వర్మ

తమన్నా విజయ్ వర్మ

Vijay Varma Angry To Had Fun Question: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా హవా చాటుతోంది తమన్నా భాటియా (Tamannaah Bhatia). హ్యాపీడేస్ మూవీతో తెలుగు యువత గుండెల్లో చిచ్చు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాలు, వెబ్ సిరీసులతో తెగ బిజీగా ఉంది. ఇటీవలే జైలర్, భోళా శంకర్ మూవీస్‍తోపాటు లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వెబ్ సిరీసులతో తెగ ట్రెండ్ అయింది. ఇదే కాకుండా ఆఖరి సచ్ అనే మరో వెబ్ సిరీస్‍తోను సందడి చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?

Abhay Movie: థియేట‌ర్ల‌లో రిలీజైన 23 ఏళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన క‌మ‌ల్‌హాస‌న్ సైకో థ్రిల్ల‌ర్ మూవీ!

Krishna mukunda murari serial today: కృష్ణకి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మీరా.. ఆదర్శ్ వల్లే ముకుంద తల్లి అవుతుందన్న భవానీ

Brahmamudi May 18th Episode: బ్రహ్మముడి- కిడ్నాపర్ల నుంచి బయటపడిన కావ్య.. భార్యను కొట్టబోయిన రాజ్.. మరదలిపై ఫైర్

అయితే తమన్నా (Tamanna) బాయ్ ఫ్రెండ్‍గా ఇటీవల తెగ హైలెట్ అయ్యాడు హైదరాబాద్ నటుడు విజయ్ వర్మ. హైదరాబాద్‍కు చెందిన విజయ్ వర్మ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో విలన్‍గా మెప్పించిన అంతగా క్లిక్ కాలేదు. కానీ, బాలీవుడ్‍లో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. విజయ్ వర్మ కూడా లస్ట్ స్టోరీస్ 2, దహాద్, కాల్‍కూట్ వంటి వెబ్ సిరీసులతో తెగ బిజీగా ఉన్నాడు. ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తమన్నా తెలిపింది. అంతకుముందు వీరిద్దరి కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

అంతేకాకుండా విజయ్ వర్మ కోసం 14 ఏళ్ల కిస్ రూల్‍ను కూడా తమన్నా బ్రేక్ చేసింది. మొన్నటివరకు వీరిద్దరూ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేశారు. అయితే విజయ్ వర్మ లేకుండా ఫొటోలు పోస్ట్ చేసింది తమన్నా. తాజాగా వెకెషన్ పూర్తి చేసుకున్న తమన్నా, విజయ్ వర్మ ఎయిర్ పోర్టుకు విడివిడిగా వచ్చారు. ముందుగా వచ్చిన తమన్నాతో ఫొటోగ్రాఫర్స్ 'విజయ్ సర్ రాలేదా?' అని అడిగారు. దానికి ఆన్సర్ చేయకుండా ఫేక్ స్మైల్‍తో తప్పించుకుంది తమన్నా.

తమన్నా తర్వాత కొద్దిసేపటికి వచ్చిన విజయ్ వర్మతో ఓ ఫొటోగ్రాఫర్ "మాల్దీవ్స్ బీచ్‍లో (తమన్నాతో) బాగా ఎంజాయ్ చేసి వచ్చారా?" అనే అర్థం వచ్చేలా ప్రశ్నించాడు. దీంతో విపరీతమైన కోపం తెచ్చుకున్న విజయ్ వర్మ ఆ ఫొటోగ్రాఫర్‍పై మండిపడ్డాడు. "అసలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అలా అడగొద్దు" అంటూ వార్నింగ్ ఇచ్చాడు విజయ్ వర్మ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం