తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Swathimuthyam Ott Release Date: స్వాతిముత్యం ఓటీటీ విడుదల తేదీ కన్ఫార్మ్.. ఎక్కడ? ఎప్పుడంటే?

Swathimuthyam OTT Release Date: స్వాతిముత్యం ఓటీటీ విడుదల తేదీ కన్ఫార్మ్.. ఎక్కడ? ఎప్పుడంటే?

19 October 2022, 18:57 IST

    • Swathimuthyam OTT Release Date: బెల్లంకొండ గణేష్ నటించిన స్వాతిముత్యం చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెలలోనే ఈ సినిమా డిజిటల్ వేదికగా విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళిక రూపొందించింది.
స్వాతిముత్యం ఓటీటీ విడుదల తేదీ ఖరారు
స్వాతిముత్యం ఓటీటీ విడుదల తేదీ ఖరారు

స్వాతిముత్యం ఓటీటీ విడుదల తేదీ ఖరారు

Swathimuthyam OTT Release Date: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లకొండ గణేష్ నటించిన తొలి చిత్రం స్వాతిముత్యం. ఇప్పటికే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొడం సాయి శ్రీనివాస్ సోదరుడిగా చిత్రసీమలో అడుగుపెట్టాడు గణేష్, తొలి చిత్రంతోనే వైవిధ్యమైన కథను ఎంచుకుని సూపర్ సక్సెస్ అందుకున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా మెరుగైన వసూళ్లను సాధించింది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు ప్రారంభించింది.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

స్వాతిముత్యం చిత్రాన్ని అక్టోబరు 24 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని సదరు వీడియో సంస్థే ట్విటర్ వేదికగా తెలియజేసింది. అక్టోబరు 5న విడుదలైన ఈ చిత్రం రిలీజైన 19 రోజుల్లోనే డిజిటల్ వేదికల్లో ప్రత్యక్షం కానుంది.

దసరా కానుకగా అక్టోబరు 5న విడుదలైన ఈ సినిమాకు పెద్ద హీరోల సినిమాల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. మెగాస్టార్ చిరంజవీ నటించిన గాడ్‌ఫాదర్, నాగార్జున ఘోస్ట్ సినిమాలు పండగ సీజన్‌లో విడుదలైనప్పటికీ.. స్వాతిముత్యం లాంటి చిన్న సినిమా కూడా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ను అందించారు.

వీర్యదానం, సరోగసిలపై వచ్చిన అత్యంత వినోదాత్మక, సందేశాత్మక చిత్రం స్వాతిముత్యం. సందేశం ఇస్తూనే.. కామెడీకి ఎలాంటి ఢోకా లేకుండా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకులు. లక్ష్మణ్‌ కే కృష్ణ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెరకెక్కించింది. ఈ సినిమాలో గణేష్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ మూవీతో ఈ కన్నడ బ్యూటీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం