Swathimuthyam Success Meet: ఊహించినదాని కంటే పెద్ద విజయాన్నిచ్చారు.. స్వాతిముత్యం సక్సెస్‌ మీట్‌లో మూవీ టీమ్-swathimuthyam movie movie success meet held in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Swathimuthyam Success Meet: ఊహించినదాని కంటే పెద్ద విజయాన్నిచ్చారు.. స్వాతిముత్యం సక్సెస్‌ మీట్‌లో మూవీ టీమ్

Swathimuthyam Success Meet: ఊహించినదాని కంటే పెద్ద విజయాన్నిచ్చారు.. స్వాతిముత్యం సక్సెస్‌ మీట్‌లో మూవీ టీమ్

Maragani Govardhan HT Telugu
Oct 07, 2022 08:19 PM IST

Swathimuthyam Success Meet: బెల్లంకొండ గణేష్ హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా చేసిన చిత్రం స్వాతిముత్య. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొని తమ విజయానందాన్ని పంచుకున్నారు.

స్వాతిముత్యం సక్సెస్ మీట్
స్వాతిముత్యం సక్సెస్ మీట్ (Feed)

Swathimuthyam Movie Success Celebrations: ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ లో ఘనంగా విజయోత్సవ వేడుకకు నిర్వహించింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. " మా సినిమాకి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ పట్ల చాలా సంతోషంగా ఉంది. సినిమా గురించి, ఇందులో పాత్రల గురించి చాలా సహజంగా మన మధ్యలో జరిగినట్లు ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. విమర్శకులు కూడా అన్ని పాత్రలకు ప్రాధాన్యమిస్తూ మంచి వినోదాన్ని పంచామని ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఓ సాధారణ కుటుంబంలో అనుకోని సమస్య వస్తే వాళ్ళు ఎలా స్పందిస్తారు అనే దాని మీదే ఈ సినిమా చేశాం. అదే అందరికీ బాగా నచ్చింది. మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి ఇద్దరం చాలా సంతోషపడ్డాం" అన్నారు.

హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. " ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను.. మళ్ళీ చెబుతున్నాను. కొత్త వారికి అవకాశం ఇవ్వడం అనేది నాగ వంశీ గారికి చిన్న విషయం అయ్యుండొచ్చు. కానీ నాకు అది చాలా పెద్ద విషయం. ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విడుదలకు ముందే ఈ సినిమా చూసి నవ్వుకుంటూ బయటకు వస్తారని మేం చెప్పాం. అయితే మేం ఊహించిన దానికంటే ఎక్కువగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. దానిని బట్టే చెప్పొచ్చు ఈ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో." అని తెలిపింది.

హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ.. " ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. మా సినిమాకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నటుడిగా నన్ను ప్రేక్షకులు అంగీకరించారు. ప్రతి ఒక్కరూ తెర మీద గణేష్ కనిపించలేదు, బాల అనే కుర్రాడు మాత్రమే తెర మీద కనిపించాడు అన్నప్పుడు.. నటుడిగా ఓ పది మార్కులు వేయించుకున్నాను అనే చిన్న తృప్తి కలిగింది. ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సితార వారికి, నాగ వంశీ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను." అని అన్నారు.

ఈ సినిమా గాడ్‌ఫాదర్‌, ఘోస్ట్‌లాంటి పెద్ద సినిమాలతో పోటీ పడుతూ దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదలైంది. లక్ష్మణ్‌ కే కృష్ణ డైరెక్ట్‌ చేసిన ఈ స్వాతిముత్యం మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెరకెక్కించింది. లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గణేష్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ మూవీతో ఈ కన్నడ బ్యూటీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

<p>స్వాతిముత్యం సక్సెస్ మీట్ చిత్రబృందం</p>
స్వాతిముత్యం సక్సెస్ మీట్ చిత్రబృందం
IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్