Swathimuthyam Success Celebrations: స్వాతిముత్యం సక్సెస్‌ సెలబ్రేట్ చేసుకున్న టీమ్.. చిత్రానికి పాజిటివ్ టాక్ -bellamkonda ganesh debut movie swathimuthyam success celebrations begin ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Swathimuthyam Success Celebrations: స్వాతిముత్యం సక్సెస్‌ సెలబ్రేట్ చేసుకున్న టీమ్.. చిత్రానికి పాజిటివ్ టాక్

Swathimuthyam Success Celebrations: స్వాతిముత్యం సక్సెస్‌ సెలబ్రేట్ చేసుకున్న టీమ్.. చిత్రానికి పాజిటివ్ టాక్

Maragani Govardhan HT Telugu
Oct 05, 2022 05:29 PM IST

Swathimuthyam: బెల్లంకొండ గణేష్ హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం స్వాతిముత్యం. బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్రబృందం ఈ సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంది.

స్వాతిముత్యం టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్
స్వాతిముత్యం టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ (Feed)

Swathimuthyam Sucess Celebrations: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లకొండ గణేష్ నటించిన తాజా చిత్రం స్వాతిముత్యం. ఇప్పటికే తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తమ్ముడైన ఈ హీరో.. స్వాతిముత్యం చిత్రంతో అరంగేట్రం చేశాడు. వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా దసరా కానుకగా బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వినోదాత్మక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో చిత్రబృందం సంబురాలు జరుపుకుంది.

స్వాతిముత్యం సినిమా బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో హీరో బెల్లంకొండ గణేష్, హీరోయిన్ వర్ష బొల్లమ్మ తదితరులు ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. టపాసులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. అంతేకాకుండా అనంతరం హీరో, హీరోయిన్లు కేకు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ అభినందనలు చెప్పుకున్నారు.

ఓ హీరో, ఓ హీరోయిన్‌.. ఇద్దరి మధ్య ప్రేమ. పెళ్లి చేసుకుందామని డిసైడ్‌ అవుతారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా జరుగుతుంటాయి. సడెన్‌గా ఓ సమస్య వచ్చి పడుతుంది. అది పెద్ద సమస్యే. అసలు ఆ సమస్య ఏంటి? ఇది వీళ్ల పెళ్లిని ఎలాంటి మలుపులు తిప్పింది? చివరికి ఈ సమస్యను పరిష్కరించి పెళ్లి చేసుకుంటారా అన్నది ఈ స్వాతిముత్యం కథ.

ఈ సినిమా గాడ్‌ఫాదర్‌, ఘోస్ట్‌లాంటి పెద్ద సినిమాలతో పోటీ పడుతూ దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదలైంది. లక్ష్మణ్‌ కే కృష్ణ డైరెక్ట్‌ చేసిన ఈ స్వాతిముత్యం మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెరకెక్కించింది. ఈ సినిమాలో గణేష్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ మూవీతో ఈ కన్నడ బ్యూటీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్