తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya: రూ.500కోట్ల బడ్జెట్‍తో సూర్య సినిమా.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందంటే!

Suriya: రూ.500కోట్ల బడ్జెట్‍తో సూర్య సినిమా.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందంటే!

03 October 2023, 19:12 IST

    • Suriya: కోలీవుడ్ హీరో సూర్య త్వరలో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయనున్నారు. సుమారు రూ.500కోట్లతో ఈ చిత్రం రూపొందనుంది. ఆ ప్రాజెక్టు గురించి తాజాగా కొన్ని విషయాలు బయటికి వచ్చాయి.
Suriya: రూ.500కోట్ల బడ్జెట్‍తో సూర్య సినిమా.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందంటే!
Suriya: రూ.500కోట్ల బడ్జెట్‍తో సూర్య సినిమా.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందంటే!

Suriya: రూ.500కోట్ల బడ్జెట్‍తో సూర్య సినిమా.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందంటే!

Suriya: తమిళ స్టార్ హీరో సూర్య వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కంగువ షూటింగ్ ముగింపునకు వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అలాగే, సుధ కొంగర దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు సూర్య. వెట్రిమారన్ డైరెక్షన్‍లో వాడి వాసల్ సినిమా కూడా చేయనున్నారు. మరోవైపు, బాలీవుడ్‍లో భారీ బడ్జెట్ చిత్రం చేసేందుకు కూడా సూర్య సిద్ధమయ్యారు. ‘కర్ణ’ పేరుతో ఆ పౌరాణిక చిత్రం రానుంది. మహాభారతం ఆధారంగా ఆ సినిమా రూపొందనుంది. కర్ణ చిత్రంపై తాజాగా కొన్ని విషయాలు బయటికి వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

Inception 2: నోలాన్ మాస్టర్‌పీస్ మూవీ ఇన్‍సెప్షన్‍కు సీక్వెల్ రానుందా?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వదులుకున్న నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇవే

Prasar Bharati OTT: ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఆనెలలో ప్రారంభం కానుందా?

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా.. ‘కర్ణ’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సుమారు రూ.500కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందనుంది. మహాభారతం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సూర్య.. కర్ణుడి పాత్ర పోషించనున్నారు. కర్ణ చిత్రాన్ని రెండు భాగాలు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కాగా, కర్ణ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది (2024) జూలైలో మొదలవుతుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య చేస్తున్న వాడి వాసల్ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది జూన్‍లోగా కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే.. 2024 జూలై నుంచి కర్ణ షూటింగ్‍లో సూర్య పాల్గొననున్నారని సమాచారం. కర్ణ చిత్రానికి రవివర్మన్.. సినిమాటోగ్రాఫర్‌గా చేయనున్నారు. కశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.

కర్ణ సినిమాతోనే బాలీవుడ్‍లోకి సూర్య ఎంట్రీ ఇవ్వనున్నారు. మహాభారతంలో ఎంతో ముఖ్యమైన కర్ణుడి పాత్రపై ఈ మైథలాజికల్ చిత్రం రూపొందనుంటడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. వివిధ ఇండస్ట్రీలకు చెందిన కొందరు స్టార్లు కూడా ఈ మూవీలో నటించననున్నారని టాక్. ప్రస్తుతం కర్ణ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడంలో దర్శకుడు ఓంప్రకాశ్ మెహ్రా బిజీగా ఉన్నారు.

మరోవైపు.. సూర్య నటించిన కంగువ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే వచ్చిన కంగువ గ్లింప్స్ ఆకట్టుకుంది. విభిన్న గెటప్‍ల్లో ఈ చిత్రంలో కనిపించనున్నారు సూర్య.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం