తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya Record: దళపతి విజయ్ రికార్డు బ్రేక్ చేసిన సూర్య

Suriya Record: దళపతి విజయ్ రికార్డు బ్రేక్ చేసిన సూర్య

Hari Prasad S HT Telugu

09 November 2023, 15:09 IST

    • Suriya Record: దళపతి విజయ్ రికార్డు బ్రేక్ చేశాడు మరో స్టార్ హీరో సూర్య. సోషల్ మీడియా ఎక్స్ లో సూర్య షేర్ చేసిన వీడియో.. అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ వీడియోగా నిలిచింది.
సుధ కొంగరతో కలిసి సూర్య43 చేస్తున్న సూర్య
సుధ కొంగరతో కలిసి సూర్య43 చేస్తున్న సూర్య

సుధ కొంగరతో కలిసి సూర్య43 చేస్తున్న సూర్య

Suriya Record: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. మరో స్టార్ దళపతి విజయ్ రికార్డు బ్రేక్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కంగువ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సూర్య.. ఈ మధ్యే తన సూర్య43 కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్స్ లో విజయ్ రికార్డు బ్రేక్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Tabu in Dune series: ఆ ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌లో కీలకపాత్ర చేయబోతున్న బాలీవుడ్ నటి

Guppedantha Manasu May 14th Episode: గుప్పెడంత మనసు- తన ఉచ్చులో తానే పడిన శైలేంద్ర- పిచ్చోడిన చేసిన మహేంద్ర, వసుధార

GV Prakash Kumar: పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత భార్యతో విడిపోయిన మ్యూజిక్ డైరెక్టర్.. మానసిక ప్రశాంతత కోసమే అంటూ..

Krishna mukunda murari serial: కృష్ణని గొడ్రాలన్న మీరా.. ముకుందకు ప్రపోజ్ చేసేందుకు ఫిక్స్ అయిన ఆదర్శ్

సూర్య 43 మూవీని సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈ ఇద్దరూ కలిసి తీసిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) నేషనల్ అవార్డు గెలిచిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తే సోషల్ మీడియా ఎక్స్ లో సూర్య షేర్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియోని ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియా వీడియోగా నిలిపింది.

సూర్య 43ని అనౌన్స్ చేస్తూ అక్టోబర్ 26న సూర్య ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి ఇప్పటికే 2.65 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఈ ప్లాట్‌ఫామ్ పై ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ వీడియో ఇదే. ఇప్పటి వరకూ దళపతి విజయ్ పోస్ట్ చేసిన వీడియో పేరిట ఈ రికార్డు ఉండేది. ఆ వీడియోకు 2.62 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను విజయ్ గతేడాది డిసెంబర్ లో పోస్ట్ చేశాడు.

అయితే సూర్య 43 అనౌన్స్‌మెంట్ వీడియో మాత్రం కేవలం రెండు వారాల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. ఈ సినిమాలో సూర్యతోపాటు దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ కూడా నటిస్తుండటం విశేషం. ఈ ముగ్గురూ సిల్వర్ స్క్రీన్ పై అగ్గి పుట్టించడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి.

మరోవైపు లియో బాక్సాఫీస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న దళపతి విజయ్.. తన నెక్ట్స్ మూవీ దళపతి 68 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి ఈ మూవీలో ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం