Director Slapped Thalapathy Vijay: ఆ డైరెక్టర్ దళపతి విజయ్‌ను ఎందుకు కొట్టాడు.. సంచలన విషయం చెప్పిన తమిళ నటుడు
Director Slapped Thalapathy Vijay: ఆ డైరెక్టర్ దళపతి విజయ్‌ను ఎందుకు కొట్టాడు? తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగిన విజయ్ ని కొట్టిన ఆ డైరెక్టర్ ఎవరు? ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తమిళ నటుడు పొన్నంబలం సంచలన విషయం చెప్పాడు.
Director Slapped Thalapathy Vijay: దళపతి విజయ్.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో పెద్ద స్టార్. లియో సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు అతడు. కానీ విజయ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ డైరెక్టర్ సెట్ లో అందరూ చూస్తుండగానే అతన్ని చెంపదెబ్బ కొట్టిన విషయం తెలుసా?
దళపతి విజయ్ ని కొట్టిన ఆ డైరెక్టర్ ఎవరో కాదు అతని తండ్రి ఎస్ఏ చంద్రశేఖరే. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తమిళ సీనియర్ నటుడు పొన్నంబలం చెప్పాడు. ఇప్పుడు విజయ్ పెద్ద స్టారే అయినా.. మొదట్లో అతన్ని హీరోగా అంగీకరించడానికి ఏ డైరెక్టర్ ముందుకు రాలేదు. దీంతో అతని తండ్రే విజయ్ ని హీరోగా పెట్టి సినిమా చేయాలని నిర్ణయించాడు.
ఆ చెంప దెబ్బే స్టార్ హీరోని చేసింది
తమిళ నటుడు పొన్నంబలం 2017లో ఇచ్చిన ఇంటర్వ్యూలో దళపతి విజయ్ కెరీర్ తొలినాళ్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఓ డైరెక్టర్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని అనుకున్నా.. విజయ్ కు అవకాశాలు ఇచ్చే వారే కరవయ్యారని అతడు తెలిపాడు. చివరికి ఎస్ఏ చంద్రశేఖరే డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా విజయ్ తో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు.
ఆ సమయంలో విజయ్ వయసు కేవలం 19 ఏళ్లు. ఆ సినిమా పేరు సెంతూరప్పండి అని పొన్నంబలం చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగానే ఓ సమయంలో సహనం కోల్పోయిన చంద్రశేఖర్.. సెట్ లో అందరూ చూస్తుండగానే చెంపదెబ్బ కొట్టాడని అతడు తెలిపాడు. అయితే ఆ చెంప దెబ్బే విజయ్ లో కసి పెంచి ఇప్పుడీ స్థాయికి చేర్చిందని కూడా పొన్నంబలం గుర్తు చేసుకున్నాడు.
మరో ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ కూడా తన కొడుకు విజయ్ గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పాడు. పీఎస్ వీరప్ప ప్రొడ్యూస్ చేసిన ఓ సినిమాలో 10 ఏళ్ల వయసులోనే విజయ్ నటించి రూ.500 రెమ్యునరేషన్ గా అందుకున్నట్లు తెలిపాడు. అక్కడ మొదలైన అతని ప్రయాణం.. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుల్లో ఒకడిగా ఎదిగే స్థాయికి చేరింది.
తాజాగా లియో మూవీకి అతడు ఏకంగా రూ.200 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.550 కోట్లకుపైనే వసూలు చేసింది.