తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sundaram Master Twitter Review: సుందరం మాస్టర్ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ నిర్మించిన కామెడీ మూవీ మెప్పించిందా?

Sundaram Master Twitter Review: సుందరం మాస్టర్ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ నిర్మించిన కామెడీ మూవీ మెప్పించిందా?

Sanjiv Kumar HT Telugu

23 February 2024, 8:30 IST

  • Sundaram Master Twitter Review In Telugu: మాస్ మహారాజా రవితేజ నిర్మించిన కొత్త సినిమా సుందరం మాస్టర్. వైవా హర్ష, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా నేడు అంటే శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సుందరం మాస్టర్ ట్విట్టర్ రివ్యూలోకి వెళితే..

సుందరం మాస్టర్ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ నిర్మించిన కామెడీ మూవీ మెప్పించిందా?
సుందరం మాస్టర్ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ నిర్మించిన కామెడీ మూవీ మెప్పించిందా?

సుందరం మాస్టర్ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ నిర్మించిన కామెడీ మూవీ మెప్పించిందా?

Sundaram Master Twitter Review Telugu: యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌తో ఎంతో పాపులర్ అయ్యాడు హర్ష చెముడు. ఆయన్ను ఎక్కువగా వైవా హర్షగానే ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు. వైవా అనే షార్ట్ ఫిల్మ్‌తో ఎక్కడాలేని క్రేజ్ సంపాదించుకున్నాడు హర్ష చెముడు. అనంతరం సినిమాల్లో చిన్ని చిన్ని పాత్రలు చేస్తూ కమెడియన్‌గా అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వైవా హర్ష హీరోగా చేసిన సినిమా సుందరం మాస్టర్.

ట్రెండింగ్ వార్తలు

Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు

Bollywood: వాటి గురించి సుశాంత్ సింగ్ చాలా బాధపడేవారు: మనోజ్ బాజ్‍పేయ్

Pavithra Jayaram: టీవీ సీరియల్ నటి మృతి.. తిరిగి రావా అంటూ భర్త చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్

Kannappa Teaser Date: కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్‍కు డేట్ ఖరారు.. ప్రతిష్టాత్మక వేదికపై..

సుందరం మాస్టర్ మూవీలో మరో షార్ట్ ఫిల్మ్స్ నటి దివ్య శ్రీపాద హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఆర్‌టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్స్‌పై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సినిమాను నిర్మించారు. సుందరం మాస్టర్ మూవీ ఫిబ్రవరి 23న అంటే శుక్రవారం విడుదల కానుంది. అయితే, గురువారం రాత్రి హైదరబాద్ ఏఎంబీ మల్టీప్లెక్సుల్లో ప్రీమియర్ షోలు వేశారు. ఈ నేపథ్యంలో ఆ టాక్ ఎలా ఉంది అనేది సుందరం మాస్టర్ ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

"మానవత్వం గురించి యూనిక్‌ కాన్సెప్టుతో వచ్చిన సినిమా సుందరం మాస్టర్. మిర్యాలమిట్టలో నడిచే కామెడీ, ఆ సెట్ ఎంతో బాగున్నప్పటికీ సినిమా ప్రభావం అంతంతమాత్రమే. అయితే, సినిమాలోని ఆలోచన కొత్తగా ఉన్నప్పిటీకి హిట్ మార్క్ అందుకోలేదు. మంచి మెస్సెజ్‌తో ఈ వీకెండ్ చూసే సినిమా" అని ఒక నెటిజన్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

"మిర్యాలమిట్ట సెట్, అక్కడి పాత్రలు వేసే కాస్ట్యూమ్స్ చాలా బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కొన్ని ఇంగ్లీష్ స్పెల్లింగ్ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే, ఫ్లాట్ అండ్ నెరేషన్ చాలా స్లోగా ఉంది. హర్ష పర్ఫామెన్స్ చాలా బాగుంది" అని ఒకరు తమ అభిప్రాయం తెలిపారు.

"సుందరం మాస్టర్‌ ఒక ప్రత్యేకమైన ఆలోచన. అది ప్రస్తుతం మానవాళికి అవసరం. మిరియాలమెట్ట ప్రాంత మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. అలాగే అక్కడి ప్రజలు వారి అమాయకత్వంతో మిమ్మల్ని నవ్విస్తారు. అంతే కానీ, కొన్ని సన్నివేశాలు తప్ప సినిమా పెద్దగా ఆకట్టుకోదు. ఆలోచన వెనుక ఉన్న కొత్తదనం పెద్దగా వర్కౌట్ కాదు. హర్షకు వందకు వంద శాతం న్యాయం చేశాడు. దివ్య శ్రీపాద మిగతా పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. మంచి మెసేజ్‌తో కాస్తా నవ్వుకునే ఎంటర్టైనర్" అని మరొకరు తెలిపారు.

"ఆలోచన వెనుక ఉన్న గొప్పతనం ఆలోచనలో ఉంటేకాదు. దాని అమలులో కూడా ఉండాలి. మంచి ఆలోచనను బాగా కమ్యూనికేట్ చేయాలి. లైట్‌ హార్ట్‌డ్‌ హెవీ మూవీకి కేవలం ఐడియా కంటే ఎక్కువగా కొన్ని మంచి సన్నివేశాలు, ఒక సోల్ కావాలి. అది సుందరం మాస్టర్‌ మూవీలో తప్పింది" అని మరొకరు సుందరం మాస్టర్‌పై రివ్యూ ఇచ్చారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం