తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sudheer Babu New Avatar: సరికొత్త అవతారంలో సుధీర్ బాబు.. సిక్స్ ప్యాక్ కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయిందా? ఇలా మారాడేంటి?

Sudheer Babu New Avatar: సరికొత్త అవతారంలో సుధీర్ బాబు.. సిక్స్ ప్యాక్ కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయిందా? ఇలా మారాడేంటి?

01 March 2023, 10:34 IST

    • Sudheer Babu New Avatar: టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబు సరికొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. మామ మశ్చీంద్ర అనే సినిమా కోసం అతడు లావుగా మారిపోయాడు. సిక్స్ ప్యాక్‌ మెయింటేన్ చేసే ఈ హీరో ఫ్యామిలీ ప్యాక్‌లోకి మారిపోయాడు.
సుధీర్ బాబును ఎప్పుడైనా ఈ లుక్ లో చూశారా?
సుధీర్ బాబును ఎప్పుడైనా ఈ లుక్ లో చూశారా?

సుధీర్ బాబును ఎప్పుడైనా ఈ లుక్ లో చూశారా?

Sudheer Babu New Avatar: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా చిత్రసీమలోకి అరంగేట్రం చేసినప్పటికీ.. ఆనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అదిరిపోయే డ్యాన్స్, ఆకట్టుకునే పర్సనాలిటీతో కెరీర్ పరంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే ఈ హీరో.. తాజాగా సరికొత్త అవతారంలో కనిపించాడు. లావుగా ఉండటమే కాకుండా తను ఇంతవరకు ఎప్పుడూ కనిపించని అన్ ఫిట్‍గా కనిపించాడు. చబ్బీగా ఉన్న సుధీర్ లుక్‌ చూసిన వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే..

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

ఇంతకీ సుధీర్ బాబు ఇంత లావుగా మారడానికి కారణమేంటో తెలుసా? మామ మశ్చీంద్ర అనే సినిమా కోసం సుధీర్ బాబు ఈ బబ్లీ లుక్‌లో కనిపించాడు. బుగ్గలు, పొట్ట ఇలా తను ఇంతవరకు ఎప్పుడూ కనిపించని రూపంలో దర్శనమిచ్చాడు. ఈ సినిమాలో సుధీర బాబు మల్టీ షేడెడ్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగా దుర్గా అనే పాత్ర కోసం ఈ విధంగా తన రూపాన్ని మార్చుకున్నాడు.

సుధీర్ బాబు లావుగా ఉండటమే కాకుండా డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అంతా విలక్షణంగా ఉంది. జీప్‌పై కూర్చున్న ఈ హీరో నోట్లో బంగారు గొలుసుతో ఎవరినో తీక్షణంగా చూస్తున్నట్లు కనిపించాడు. పొడవాటి జుట్టు, తేలికపాటి గడ్డంతో దర్శనమిచ్చాడు.

మామా మశ్చీంద్రా అనే ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోందీ చిత్రం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పీజీ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. సుధీర్ బాబు ఇందులో మల్టీ షేడెడ్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం