Gaalodu OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న సుడిగాలి సుధీర్ గాలోడు - స్ట్రీమింగ్ డేట్ ఇదే-gaalodu ott release date locked sudigali sudheer movie streaming on aha on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Gaalodu Ott Release Date Locked Sudigali Sudheer Movie Streaming On Aha On This Date

Gaalodu OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న సుడిగాలి సుధీర్ గాలోడు - స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Feb 12, 2023 09:18 AM IST

Gaalodu OTT Release Date: సుడిగాలి సుధీర్ హీరోగా న‌టించిన గాలోడు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు రిలీజ్ కానుందంటే...

సుడిగాలి సుధీర్  గాలోడు
సుడిగాలి సుధీర్ గాలోడు

Gaalodu OTT Release Date: సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా న‌టించిన గాలోడు సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైన మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 17న ఆహా ఓటీటీలో గాలోడు రిలీజ్ కానుంది. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 18న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన గాలోడు నిర్మాత‌ల‌కు ఐదు కోట్ల‌కుపైగా లాభాల‌ను మిగిల్చింది. బుల్లితెర‌పై సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ బిగ్‌స్క్రీన్‌పై క‌లిసివ‌చ్చింది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పులిచెర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గెహ‌నా సిప్పీ హీరోయిన్‌గా న‌టించింది.

గాలోడు క‌థేమిటంటే...

ర‌జ‌నీకాంత్ (సుడిగాలి సుధీర్‌) అనే యువ‌కుడు ఏ ప‌ని పాట లేకుండా ఊరిలో జులాయిగా తిరుతుంటాడు. అనుకోకుండా ఓ మ‌ర్డ‌ర్ కేసులో చిక్కుకున్న అత‌డు ఆ నేరం నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? శుక్ల (గెహానా సిప్పీ) అనే అమ్మాయి ప్రేమ‌ను ఎలా సొంతం చేసుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

కంప్లీట్ మాస్ క్యారెక్ట‌ర్‌లో సుధీర్ న‌టించిన సినిమా ఇది. గాలోడుకు ముందు సుడిగాలి సుధీర్‌, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పులిచెర్ల కాంబినేష‌న్‌లో సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే సినిమా రూపొందింది.

IPL_Entry_Point

టాపిక్