తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sreenu Vaitla And Bellamkonda: క్రేజీ ఆఫర్ కొట్టేసిన బెల్లంకొండ శ్రీను.. స్టార్ డైరెక్టర్‌తో పనిచేసే అవకాశం..!

Sreenu Vaitla and Bellamkonda: క్రేజీ ఆఫర్ కొట్టేసిన బెల్లంకొండ శ్రీను.. స్టార్ డైరెక్టర్‌తో పనిచేసే అవకాశం..!

08 April 2023, 14:27 IST

    • Sreenu Vaitla and Bellamkonda: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ మూవీ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది. ప్రస్తుతం బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు.
బెల్లంకొండ శ్రీనివాస్
బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్

Sreenu Vaitla and Bellamkonda: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల.. వరుస పరాజయాల కారణంగా డీలా పడ్డాడు. అతడు తీసిన సినిమాలు ప్లాఫ్ అవ్వడంతో స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చేందుకు వెనకాడుతున్నారు. దీంతో కొంత కాలంగా మూవీస్‌కు గ్యాప్ ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల ఎట్టకేలకు ఓ ప్రాజెక్టుతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరోతో మూవీ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇంతకీ అతడేవరో కాదు అల్లుడు శ్రీనుగా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బెల్లంకొండ శ్రీనివాస్‌తో శ్రీను వైట్ల సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ మూవీ పక్కా కమర్షియల్ యాంగిల్‌లో ఉంటుందట. యాక్షన్ సీక్వెన్సులతో పాటు శ్రీను వైట్ల తరహా వినోదం ఇందులో పుష్కలంగా ఉండనుందని తెలుస్తోంది. దీంతో మరోసారి పాత శ్రీను వైట్లను చూడబోతున్నామని సినీ ప్రేక్షకులు సంబరపడుతున్నారు.

ఈ మూవీకి ప్రియదర్శిని రామ్ స్క్రిప్ట్ అందించనున్నారట. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ కొన్ని కమిట్మెంట్లతో ఉన్న కారణంగా త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. ఇందులో నటించనున్న నటీనటులు, సాంకేతిక బృందం గురించి కూడా అప్పుడే ప్రకటిచనున్నారు.

అల్లుడు శ్రీను సినిమాతో చిత్రసీమంలో అరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు మూటగట్టుకున్నప్పటికీ రాట్టసన్ తెలుగు రీమేక్ రాక్షసుడుతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ నటించిన ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. దీనికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. మేలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం