Rashmika-Bellamkonda Sreenivas: విజయ్ ప్రేమ‌కు ర‌ష్మిక బ్రేక‌ప్? - బెల్లంకొండ శ్రీనివాస్‌తో డేటింగ్‌లో నేష‌న‌ల్ క్ర‌ష్‌?-rashmika mandanna dating bellamkonda sreenivas after break up with vijay deverakonda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika-bellamkonda Sreenivas: విజయ్ ప్రేమ‌కు ర‌ష్మిక బ్రేక‌ప్? - బెల్లంకొండ శ్రీనివాస్‌తో డేటింగ్‌లో నేష‌న‌ల్ క్ర‌ష్‌?

Rashmika-Bellamkonda Sreenivas: విజయ్ ప్రేమ‌కు ర‌ష్మిక బ్రేక‌ప్? - బెల్లంకొండ శ్రీనివాస్‌తో డేటింగ్‌లో నేష‌న‌ల్ క్ర‌ష్‌?

Nelki Naresh Kumar HT Telugu
Apr 04, 2023 10:31 AM IST

Rashmika-Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో నేష‌న‌ల్ క్ర‌ష్‌ ర‌ష్మిక మంద‌న్న ప్రేమ‌లో ప‌డిన‌ట్లు టాలీవుడ్‌లో కొత్త రూమ‌ర్స్ వినిపిస్తోన్నాయి. ఇటీవ‌లే ముంబై ఏయిర్‌పోర్ట్‌లో ర‌ష్మిక‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ క‌లిసి క‌నిపించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్‌, ర‌ష్మిక మంద‌న్న‌
బెల్లంకొండ శ్రీనివాస్‌, ర‌ష్మిక మంద‌న్న‌

Rashmika-Bellamkonda Srinivas: ర‌ష్మిక మంద‌న్న విజ‌య్ దేవ‌ర‌కొండ బ్రేక‌ప్ వార్త‌లు టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. గీతాగోవిందం, డియ‌ర్ కామేడ్ర్ సినిమాల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నారు విజ‌య్, ర‌ష్మిక‌. ఈ సినిమా షూటింగ్స్‌లోనే వీరి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. త‌మ మ‌ధ్య స్నేహానికి మించిన బంధ ఉంద‌ని విజ‌య్‌తో రిలేష‌న్‌షిప్‌పై ర‌ష్మిక ప‌లుమార్లు స‌మాధానం చెప్పింది.

ఏమైందో ఏమో ఇద్ద‌రి ప్రేమ‌కు బ్రేక‌ప్ ప‌డిన‌ట్లు ప్ర‌స్తుతం వార్త‌లు వినిపిస్తోన్నాయి. గ‌త కొన్నాళ్లుగా ర‌ష్మిక‌కు విజ‌య్ దూరంగా ఉంటున్న‌ట్లు చెబుతోన్నారు. విజ‌య్‌కి గుడ్‌బై చెప్పిన ర‌ష్మిక మ‌రో టాలీవుడ్ హీరోతో చెట్ట‌ప‌ట్టాలేసుకొని తిరుగుతోంద‌ని అంటోన్నారు. ఆ హీరో మ‌రెవ‌రో కాదు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఇటీవ‌లే ర‌ష్మిక మంద‌న్న‌, బెల్లంకొండ శ్రీనివాస్ జంట‌గా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించ‌డంతో ఈ కొత్త రూమ‌ర్స్ తెర‌పైకి వ‌చ్చాయి.

ఓ ఈవెంట్ కోసం ర‌ష్మిక మంద‌న్న‌, బెల్లంకొండ శ్రీనివాస్ క‌లిసి ముంబై వెళ్లారు. అక్క‌డి ఎయిర్‌పోర్ట్‌లో ఫొటోల‌కు ఫోజులివ్వ‌డ‌మే కాకుండా క‌లిసి ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు, వీడియోలో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. ముంబై ఈవెంట్‌లో ర‌ష్మిక‌, శ్రీనివాస్ క్లోజ్‌గా మూవ్ కావ‌డం చూసిన ఫ్యాన్స్ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉందంటూ పుకార్లు మొద‌లు పెట్టారు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ర‌ష్మిక డేటింగ్‌లో ఉంద‌ని చెబుతోన్నారు.

కాగా ప్ర‌స్తుతం ప‌లు పాన్ ఇండియ‌న్ సినిమాల‌తో ర‌ష్మిక బిజీగా ఉంది. తెలుగులో పుష్ప 2, నితిన్‌-వెంకీ కుడుముల మూవీతో పాటు రెయిన్‌బో సినిమాలో న‌టిస్తోంది. హిందీలో యానిమ‌ల్ సినిమా చేస్తోంది. మ‌రోవైపు ఛ‌త్ర‌ప‌తి రీమేక్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమా మే 12న రిలీజ్ కానుంది.

IPL_Entry_Point