తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Skanda Sequel: స్కంద -2 ఫిక్స్‌ - సీక్వెల్‌ను అనౌన్స్ చేసిన బోయ‌పాటి - రామ్ ఫ్యాన్స్ ఖుషి

Skanda Sequel: స్కంద -2 ఫిక్స్‌ - సీక్వెల్‌ను అనౌన్స్ చేసిన బోయ‌పాటి - రామ్ ఫ్యాన్స్ ఖుషి

28 September 2023, 10:37 IST

  • Skanda Sequel: రామ్ స్కంద మూవీకి సీక్వెల్ రాబోతుంది. స్కంద క్లైమాక్స్‌లో సీక్వెల్‌పై అప్‌డేట్ ఇచ్చారు రామ్‌, బోయ‌పాటి శ్రీను. స్కంద 2 ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

రామ్ స్కంద మూవీ
రామ్ స్కంద మూవీ

రామ్ స్కంద మూవీ

Skanda Sequel: రామ్, బోయ‌పాటి శ్రీను క‌ల‌యిక‌లో రూపొందిన స్కంద సినిమాకు సీక్వెల్ రాబోతోంది. స్కంద సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్‌పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు రామ్‌, బోయ‌పాటి శ్రీను. స్కంద 2 ఉంటుంద‌ని అనౌన్స్‌చేశారు. స్కంద సీక్వెల్ అనౌన్స్‌మెంట్‌తో రామ్ ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు. స్కంద త‌ర్వాత బాల‌కృష్ణ‌తో అఖండ సీక్వెల్‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో బోయ‌పాటి శ్రీను ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

ఆ సినిమా త‌ర్వాతే స్కంద 2 సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. స్కంద సినిమా తెలుగుతో పాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో గురువారం (నేడు) రిలీజైంది. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ పూర్తిస్థాయి మాస్ పాత్ర‌లో రామ్ న‌టించిన సినిమా ఇది. ఇందులో రామ్ డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో న‌టించారు. రామ్ అభిమానుల‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను ఈ సినిమా మెప్పిస్తోంది.

బోయ‌పాటి స్టైల్ టిపిక‌ల్ మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా ఇదంటూ కామెంట్స్ చేస్తున్నారు. క‌థ రొటీన్‌గానే ఉన్నా మాస్ సీన్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో డైరెక్ట‌ర్ మెప్పించాడ‌నే ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ చెబుతోన్నారు. త‌మ‌న్ బీజీఎమ్‌తో పాటు శ్రీలీల గ్లామ‌ర్‌, డాన్సుల‌పై ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

స్కంద కోసం రామ్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యి న‌టించారు. స్కంద సినిమాలో శ్రీలీల‌తో పాటు స‌యిమంజ్రేక‌ర్ మ‌రో హీరోయిన్‌గా క‌నిపించింది. శ్రీకాంత్‌, ప్రిన్స్‌తో పాటు సీనియ‌ర్ న‌టుడు ద‌గ్గుబాటి రాజా కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ ప‌తాకంపై శ్రీనివాస చిట్టూరి స్కంద సినిమాను నిర్మించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం