తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Skanda New Trailer: దుమ్మురేపుతున్న స్కంద నయా ట్రైలర్‌.. 24 గంటలలోపే..

Skanda New Trailer: దుమ్మురేపుతున్న స్కంద నయా ట్రైలర్‌.. 24 గంటలలోపే..

26 September 2023, 15:55 IST

    • Skanda New Trailer: స్కంద నుంచి వచ్చిన కొత్త రిలీజ్ ట్రైలర్ యూట్యూబ్‍లో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. 24 గంటల్లోగానే భారీ వ్యూస్ సాధించింది. ఆ వివరాలివే..
Skanda New Trailer: దుమ్మురేపుతున్న స్కంద నయా ట్రైలర్‌.. 24 గంటలలోపే..
Skanda New Trailer: దుమ్మురేపుతున్న స్కంద నయా ట్రైలర్‌.. 24 గంటలలోపే..

Skanda New Trailer: దుమ్మురేపుతున్న స్కంద నయా ట్రైలర్‌.. 24 గంటలలోపే..

Skanda New Trailer: బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. గురువారం (సెప్టెంబర్ 28) ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో మూవీ యూనిట్ సోమవారం (సెప్టెంబర్ 25) ఓ కొత్త ట్రైలర్ విడుదల చేసింది. రిలీజ్ ట్రైలర్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. అంతకు ముందు తెచ్చిన ట్రైలర్ కంటే.. ఈ రిలీజ్ ట్రైలర్‌లో యాక్షన్ సీక్వెన్సులు, రామ్ మాస్ లుక్, డైలాగ్స్ అదిరిపోయాయి. యాక్షన్ ఫీస్ట్‌లా ఉంది. దీంతో స్కంద రిలీజ్ ట్రైలర్‌ వ్యూస్‍లో దూసుకుపోతోంది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

స్కంద రిలీజ్ ట్రైలర్‌ను కరీంనగర్‌లో జరిగిన కల్ట్ జాతర ఈవెంట్‍లో సోమవారం రాత్రి రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మాస్ యాక్షన్ సీన్లతో, పవర్ ఫుల్ డైలాగ్‍లతో ట్రైలర్ హోరెత్తిపోయింది. దీంతో స్కంద మూవీకి హైప్ మరింత పెరిగింది. కాగా, స్కంద తెలుగు రిలీజ్ ట్రైలర్‌ యూట్యూబ్‍లో ఇప్పటికే 10 మిలియన్ల (కోటి) వ్యూస్ మార్క్ దాటేసింది. ట్రైలర్ వచ్చి 24 గంటలు గడవకముందే 10 మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్ క్రాస్ చేసింది. యూట్యూబ్‍లో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ట్వీట్ చేసింది. “చూసుకుందాం.. బరాబర్ చూసుకుందాం. 10 మిలియన్ల రియల్ టైమ్స్ వ్యూస్ దాటి స్కంద తెలుగు ట్రైలర్ యూట్యూబ్‍లో టాప్‍ ట్రెండింగ్‍లో ఉంది” అని పోస్ట్ చేసింది.

“రీసౌండ్ రావాలే”, “బరాబర్ చూసుకుందాం” “నేను సంపేటప్పుడు వాడి తలకాయ యాడుందో చూస్తా.. వాడి ఎనకాల ఎవడు ఉన్నాడో చూడను” ఇలా రామ్ పోతినేని చెప్పిన కొన్ని మాస్ డైలాగ్స్ ఈ రిలీజ్ ట్రైలర్లో హైలైట్‍గా ఉన్నాయి. ఇక బోయపాటి మార్క్ యాక్షన్ సీన్లు దద్దరిల్లిపోయాయి. రామ్ కొత్త రస్టిక్ లుక్‍తో అదిరిపోయాడు. థమన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ ట్రైలర్‌కు తగ్గట్టుగానే ఉంది. గతంలో వచ్చిన ట్రైలర్ కొందరికి అసంతృప్తి మిగిల్చినా.. ఈ రిలీజ్ ట్రైలర్ మాత్రం సినిమాపై హైప్‍ను పెంచేలా ఉంది.

స్కంద చిత్రం సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వో వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా స్కందను తెరకెక్కించారు బోయపాటి శ్రీను.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం