తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siddhanth Kapoor: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ సోదరుడి అరెస్ట్‌

Siddhanth Kapoor: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ సోదరుడి అరెస్ట్‌

Hari Prasad S HT Telugu

13 June 2022, 10:51 IST

    • డ్రగ్స్‌ కేసులో మరో సెలబ్రిటీ దొరికిపోయాడు. బాలీవుడ్‌ నటుడు శక్తికపూర్‌ తనయుడు, నటి శ్రద్ధా కపూర్‌ సోదరుడు సిద్ధాంత్‌ కపూర్‌ డ్రగ్స్‌ తీసుకున్నాడంటూ పోలీసులు అతన్ని నిర్బంధించారు.
తండ్రి శక్తి కపూర్ తో సిద్ధాంత్ కపూర్
తండ్రి శక్తి కపూర్ తో సిద్ధాంత్ కపూర్ (HT_PRINT)

తండ్రి శక్తి కపూర్ తో సిద్ధాంత్ కపూర్

బెంగళూరు: బాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. ఈసారి ప్రముఖ నటి శ్రద్ధాకపూర్‌ సోదరుడు సిద్ధాంత్‌ కపూర్‌ డ్రగ్స్‌ తీసుకుంటూ దొరికిపోయాడు. బెంగళూరులో ఆదివారం జరిగిన ఓ రేవ్‌ పార్టీలో సిద్ధాంత్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతడు డ్రగ్స్‌ పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. ఎంజీ రోడ్‌లోని హోటల్‌లో జరుగుతున్న పార్టీ సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్..కాంచనని మోసం చేస్తున్న శ్రీధర్.. కార్తీక్ గురించి మరో నిజం తెలుసుకున్న పారిజాతం

Guppedantha Manasu Serial: వ‌సుతో రాజీవ్ పెళ్లి- శైలేంద్ర ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాప్ - రిషి రీఎంట్రీకి టైమొచ్చింది!

Preminchoddu: పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన సినిమా.. తెలుగులో తమిళ ఫ్లేవర్‌తో ప్రేమించొద్దు

Krishnamma OTT: ఓటీటీలోకి స‌డెన్‌గా వ‌చ్చిన స‌త్య‌దేవ్ కృష్ణ‌మ్మ - రివేంజ్ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఈ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్నట్లు అనుమానిస్తున్న 35 మంది నమూనాలను పరీక్షల కోసం పంపించారు. వీళ్లలో ఆరుగురి ఫలితాలు పాజిటివ్‌గా రాగా.. అందులో సిద్ధాంత్‌ కపూర్‌ కూడా ఉన్నాడు. వాళ్లు డ్రగ్స్‌ తీసుకొని హోటల్‌కు వచ్చారా లేక హోటల్‌లోనే డ్రగ్స్‌ తీసుకున్నారా అన్నది తెలియలేదని పోలీసులు చెప్పారు. శక్తికపూర్‌ తనయుడు అయిన సిద్ధాంత్ కూడా నటుడే.

2020లో వచ్చిన హిందీ వెబ్‌ సిరీస్‌ భౌకాల్‌లో అతడు చింటూ క్యారెక్టర్‌ పోషించాడు. షూటౌట్‌ ఎట్‌ వాడాలా, అగ్లీ, హసీనా పార్కర్‌, చెహ్రెలాంటి బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించాడు. భాగమ్‌ భాగ్‌, చుప్‌ చుప్‌ కే, భూల్‌ భులయ్యా, ఢోల్‌లాంటి సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పని చేశాడు. అయితే తన కొడుకు సిద్ధాంత్ డ్రగ్స్‌ తీసుకున్నాడన్న వార్తపై స్పందించిన శక్తి కపూర్‌.. ఇది అసాధ్యమని అన్నాడు.

తాను ముంబైలో ఉన్నానని, బెంగళూరులో ఏం జరుగుతోందో తెలియదని చెప్పాడు. అయితే ప్రస్తుతానికి సిద్ధాంత్‌ను కేవలం నిర్బంధించారని, అరెస్ట చేయలేదని హిందుస్థాన్‌ టైమ్స్‌కు తెలిపాడు. సిద్ధాంత్‌ ఓ డీజే అని, పార్టీల్లో అదే పని చేస్తుంటాడని, అందుకే బెంగళూరు వెళ్లాడని శక్తికపూర్‌ చెప్పాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం