తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shruti Haasan Replaces Samantha: ఆ భారీ ప్రాజెక్ట్‌లో సమంత రోల్ కొట్టేసిన శృతి హాసన్

Shruti Haasan replaces Samantha: ఆ భారీ ప్రాజెక్ట్‌లో సమంత రోల్ కొట్టేసిన శృతి హాసన్

Hari Prasad S HT Telugu

24 January 2024, 15:46 IST

    • Shruti Haasan replaces Samantha: రొమాంటిక్ కామెడీ మూవీ చెన్నై స్టోరీలో సమంత రోల్ ను కొట్టేసింది శృతి హాసన్. ఇందులో ఆమె ఓ ప్రైవేట్ డిటెక్టివ్ గా నటిస్తోంది.
చెన్నై స్టోరీ మూవీలో సమంత స్థానంలో శృతి హాసన్
చెన్నై స్టోరీ మూవీలో సమంత స్థానంలో శృతి హాసన్ (Instagram)

చెన్నై స్టోరీ మూవీలో సమంత స్థానంలో శృతి హాసన్

Shruti Haasan replaces Samantha: చెన్నై స్టోరీ మూవీ టీమ్ తో శృతి హాసన్ చేరింది. సినిమాల నుంచి సమంత బ్రేక్ తీసుకోవడంతో శృతిని ఈ పాత్ర వరించింది. నిజానికి నవంబర్ 2021 లో, సమంత ఇండో-బ్రిటీష్ ప్రాజెక్ట్ కోసం డౌన్‌టౌన్ అబ్బే దర్శకుడు ఫిలిప్ జాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

ఈ ఇంగ్లిష్ మూవీ టైమ్రీ ఎన్ మురారి రాసిన, 2004లో అత్యధికంగా అమ్ముడైన నవల ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ కి తెరరూపం. అయితే ఈ ప్రాజెక్ట్ లో వివేక్ కల్రాతో పాటు శ్రుతిహాసన్ కూడా నటిస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ వెల్లడించింది.

చెన్నై స్టోరీ ఏంటంటే?

చెన్నై స్టోరీ వేల్స్‌తోపాటు ఇండియాలో జరిగిన ఓ రొమాంటిక్ కామెడీ స్టోరీ. అను అనే ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో శ్రుతి నటించనుంది. బాఫ్టా(BAFTA) విజేత ఫిలిప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిమ్మి సహ రచయిత. ఈ చిత్రం ప్రధానంగా ఇంగ్లీష్, కొద్దిగా తమిళం, వెల్ష్ తో కూడి ఉంటుంది.

సునీత తాటి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో నటించడం ఆనందంగా ఉందని శ్రుతి తెలిపింది. చెన్నైకి చెందిన ఈ కథ తనకెంతో ప్రత్యేకమని, ఫిల్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, అంతర్జాతీయ భాగస్వామ్యం ద్వారా పాతుకుపోయిన కథలను చెప్పడమే సినిమా మేకింగ్ అని ఆమె అన్నారు. బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన యూకే గ్లోబల్ స్క్రీన్ ఫండ్ కూడా ఈ చిత్రాన్ని సపోర్ట్ చేస్తోంది.

డిటెక్టివ్ పాత్రలో శృతి

ఓ ఏజెన్సీని నడుపుతున్న ద్విలింగ సంపర్క తమిళ మహిళ కథే 'ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్'. ఒక వెల్ష్-ఇండియన్ వ్యక్తి కనిపించకుండా పోయిన తన తండ్రిని కనుగొనే ప్రయత్నంలో ఉంటాడు. అతనికి సహాయం చేసే డిటెక్టివ్ పాత్రలో శ్రుతి నటించనుండగా, తండ్రిని వెతికే వ్యక్తిగా వివేక్ నటించనున్నాడు. అను పాత్ర కోసం సమంత ఆడిషన్స్ చేసిందని, అయితే ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడంతో ఆమె లేకుండానే ముందుకు వెళ్లాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

శ్రుతి ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సలార్' చిత్రంలో నటించింది. త్వరలో అడివి శేష్ తో కలిసి హిందీ-తెలుగు ప్రాజెక్ట్ డెకాయిట్ లో నటించనుంది. కన్నడ చిత్రం టాక్సిక్ లో ఆమె యష్ తో కలిసి నటిస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ నిర్మాతలు ఇంకా ధృవీకరించలేదు. మార్క్ రౌలీతో కలిసి డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన బ్రిటిష్ సైకలాజికల్ థ్రిల్లర్ ది ఐలో కూడా శ్రుతి నటించింది.

అటు సమంత హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత గతేడాది సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె నటించిన సిటడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం సమంత తన మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకోవడంతోపాటు వ్యక్తిగత జీవితంపై దృష్టి సారిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం