Samantha on Naga Chaitanya: నాగ చైతన్యపై సమంత షాకింగ్ కామెంట్స్.. అతని వల్లే ఆ విషయం తెలుసుకోలేదంటూ..-samantha on naga chaitanya says her likes and dislikes were influenced by him ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha On Naga Chaitanya: నాగ చైతన్యపై సమంత షాకింగ్ కామెంట్స్.. అతని వల్లే ఆ విషయం తెలుసుకోలేదంటూ..

Samantha on Naga Chaitanya: నాగ చైతన్యపై సమంత షాకింగ్ కామెంట్స్.. అతని వల్లే ఆ విషయం తెలుసుకోలేదంటూ..

Hari Prasad S HT Telugu
Jan 18, 2024 06:21 PM IST

Samantha on Naga Chaitanya: తన మాజీ భర్త నాగ చైతన్యపై షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత. అతని పేరు నేరుగా ప్రస్తావించకుండా తన ఇష్టాయిష్టాలను అతడు ప్రభావితం చేశాడని స్పష్టం చేసింది.

సమంత, నాగ చైతన్య
సమంత, నాగ చైతన్య (Instagram)

Samantha on Naga Chaitanya: సమంత, నాగ చైతన్య విడిపోయి చాన్నాళ్లవుతోంది. అయితే ఇప్పటికీ ఈ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. అప్పుడుప్పుడూ సమంతే చెప్పీచెప్పనట్లుగా తన చేదు జ్ఞాపకాలను పంచుకుంటోంది. ముఖ్యంగా తాను మయోసైటిస్ బారిన పడినప్పటి నుంచీ వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ వస్తోంది.

ఈ మధ్యే సమంత తన ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్లో అభిమానులతో ఆమె ముచ్చటించింది. ఈ సందర్భంగా నాగ చైతన్య పేరు ప్రస్తావించకుండానే గతంలో తన భాగస్వామిగా ఉన్న వ్యక్తి తన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేశాడని, అందుకే తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి తనకు తెలియదని ఆమె అనడం విశేషం. ఈ ఎపిసోడ్ పై ఆమె ఇంకా ఏమన్నదో ఒకసారి చూద్దాం.

ఆ వ్యక్తి వల్లే ఇలా..

బ్రాడ్‌కాస్ట్ ఛానెల్లో ఇంటరాక్షన్ సందర్భంగా ఓ అభిమాని ఆమెను ఓ ప్రశ్న అడిగారు. "ఒకవేళ మీ వ్యక్తిగత వృద్ధి ఓ హైలైట్ రీల్ అయితే.. అందులో మీరు బాగా నవ్వుకునే బ్లూపర్ ఏది.. అలాగే మీకు జీవిత పాఠం నేర్పిన ఆస్కార్ లెవల్ మూమెంట్ ఏది" అని ప్రశ్నించారు. దీనికి సమంత స్పందిస్తూ.. చైతన్య పేరు ప్రస్తావించకుండా అతన్ని నిందించింది.

"బహుషా నేను చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే.. నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలం కావడమే అనుకుంటాను. ఎందుకంటే ఆ సమయంలో నా భాగస్వామిగా ఉన్న వ్యక్తి వాటిని ఎప్పుడూ ప్రభావితం చేస్తుండేవాడు" అని సమంత చెప్పింది. చై పేరు ప్రస్తావించకపోయినా.. ఆమె ఎవరి గురించి మాట్లాడుతుందో ఫ్యాన్స్ కు అర్థమైపోయింది.

అయితే జీవితంలో చాలా కష్ట సమయంలోనూ నేర్చుకోవడానికి ఎంతో విలువైన పాఠం ఉందని నేను గుర్తించిన క్షణంలో నా వ్యక్తిగత వృద్ధి సాధ్యమైందని సమంత చెప్పింది. గతేడాది శాకుంతలం, ఖుషీ మూవీస్ బోల్తా కొట్టడంతో సమంత ఏడాదిపాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం ఆమె తమ మయోసైటిస్ కు చికిత్స తీసుకోవడంతోపాటు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

ఇప్పటికే ఆమె నటించిన సిటడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి కాగా.. ఇది స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. ఈ ఏడాది సమంత చెన్నై స్టోరీస్ అనే ఇంగ్లిష్ మూవీలోనూ నటించనుంది. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నప్పటి నుంచీ సమంత భూటాన్, దుబాయ్ లాంటి ప్రాంతాలకు తిరగడంతోపాటు తన ఇంట్లోనూ హాయిగా గడిపేస్తోంది.

అటు నాగ చైతన్య కూడా థ్యాంక్యూ, కస్టడీ సినిమాల డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ఓ మత్స్యకారుడి పాత్రలో చై కనిపించనున్నాడు. ఈ మధ్యే వచ్చిన మూవీ గ్లింప్స్ లో అతడు రగ్గ్‌డ్ లుక్ లో అదరగొట్టాడు. ఈ సినిమాపై అతడు భారీ ఆశలే పెట్టుకున్నాడు. హ్యాట్రిక్ ఫ్లాపుల నుంచి ఈ తండేల్ అతన్ని గట్టెక్కిస్తుందేమో చూడాలి.

Whats_app_banner