తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer: గేమ్ ఛేంజర్ నుంచి సర్‌ప్రైజ్ వస్తోందా.. శంకర్ ట్వీట్‌కు అర్థమేంటి?

Game Changer: గేమ్ ఛేంజర్ నుంచి సర్‌ప్రైజ్ వస్తోందా.. శంకర్ ట్వీట్‌కు అర్థమేంటి?

Hari Prasad S HT Telugu

31 July 2023, 21:46 IST

    • Game Changer: గేమ్ ఛేంజర్ నుంచి సర్‌ప్రైజ్ వస్తోందా? డైరెక్టర్ శంకర్ చేసిన ట్వీట్‌కు అర్థమేంటి? ఇప్పుడీ ట్వీట్ పై చెర్రీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.
గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్
గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్

Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. ఇండియన్ సినిమా గర్వించదగిన డైరెక్టర్లలో ఒకడైన శంకర్ శణ్ముగం డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా ఎన్నో మరుపురాని సినిమాలు అందించిన శంకర్.. ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా తీస్తుండటంతో సహజంగానే ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు

OTT: సడన్‍గా మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’: వివరాలివే

Vishwak Sen: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్యాడ్ సాంగ్.. చీకటి ప్రపంచంలోని పాత్రలను పరిచయం చేస్తూ!

OTT Best Movies: 5 ఓటీటీల్లోని 5 బెస్ట్ సినిమాలు ఇవే! ఈ వీకెండ్‌కు మస్ట్ వాచ్.. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అంటే?

Madhavan: బ్లాక్‌బ‌స్ట‌ర్ ల‌వ్‌స్టోరీతో మాధ‌వ‌న్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది - ఆ మూవీ ఎలా మిస్స‌యిందంటే?

వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతున్నా.. అప్పుడప్పుడూ ఈ మూవీ టీమ్ నుంచి వస్తున్న అప్‌డేట్స్ అభిమానులకు ఆకర్షిస్తున్నాయి. తాజాగా సోమవారం (జులై 31) రామ్ చరణ్, శంకర్ మధ్య నడిచిన ట్వీట్ చాట్ ఆసక్తి రేపుతోంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శంకర్ కు శుభాకాంక్షలు చెబుతూ చెర్రీ ఓ ట్వీట్ చేశాడు.

"ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నిజమైన గేమ్ ఛేంజర్. సినిమా ఇండస్ట్రీలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శంకర్ సర్ కు శుభాకాంక్షలు. మీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా" అంటూ చరణ్ ట్వీట్ చేశాడు. దీనికి శంకర్ రిప్లై ఇచ్చాడు. ఆ ట్వీట్ లోనే గేమ్ ఛేంజర్ గురించి ఓ సర్ ప్రైజ్ ఉండబోతోందని పరోక్షంగా అతడు వెల్లడించాడు.

"నీ స్వీట్ విషెస్ కు థ్యాంక్యూ రామ్.. గేమ్ ఛేంజర్. వచ్చే ఆగస్ట్ లో మనం వేయబోతున్న మరో ముందడుగు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా" అని శంకర్ ట్వీట్ చేశాడు. దీంతో వచ్చే నెల ఏం జరగబోతోందో అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే ఆగస్ట్ లో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, హిందీల్లో రిలీజ్ కానుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50వ సినిమాగా గేమ్ ఛేంజర్ రాబోతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం