తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shah Rukh Khan At Lalbaugcha Raja: లాల్‌బాగ్చా రాజా దర్శనానికి షారుక్ ఖాన్.. వీడియో వైరల్

Shah Rukh Khan at Lalbaugcha Raja: లాల్‌బాగ్చా రాజా దర్శనానికి షారుక్ ఖాన్.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

21 September 2023, 18:48 IST

    • Shah Rukh Khan at Lalbaugcha Raja: లాల్‌బాగ్చా రాజా దర్శనానికి వచ్చాడు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లాల్‌బాగ్చా రాజా దగ్గర షారుక్ ఖాన్ ప్రత్యేక పూజలు
లాల్‌బాగ్చా రాజా దగ్గర షారుక్ ఖాన్ ప్రత్యేక పూజలు

లాల్‌బాగ్చా రాజా దగ్గర షారుక్ ఖాన్ ప్రత్యేక పూజలు

Shah Rukh Khan at Lalbaugcha Raja: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ముంబైలోని ప్రముఖ గణేష్ మండపం లాల్ బాగ్చా రాజా దర్శనానికి వచ్చాడు. తన కొడుకు అబ్రామ్ తో కలిసి కింగ్ ఖాన్ గురువారం (సెప్టెంబర్ 21) గణేషుడి దర్శనానికి రావడం విశేషం. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుని ఆశీర్వాదం తీసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

లాల్‌బాగ్చా రాజా మండపంలో షారుక్ ఖాన్ ఉన్న వీడియో వైరల్ అవుతోంది. వైట్ షార్ట్ వేసుకున్న షారుక్.. నుదుటన తిలకంతో కనిపించాడు అతని చిన్న కొడుకు అబ్రామ్ కూడా షారుక్ వెంట ఉన్నాడు. వీళ్లతోపాటు షారుక్ మేనేజర్ పూజా దద్లానీ కూడా అక్కడ కనిపించింది. దర్శనం తర్వాత అతనికి అక్కడి పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

లాల్‌బాగ్చా రాజా చరిత్ర పెద్దదే..

ముంబైలోని లాల్‌బాగ్చా రాజా చరిత్ర ఘనమైనదే. ప్రతి ఏటా ఇక్కడ ప్రతిష్టించే గణేషుడిని అక్కడి సినీ, రాజకీయ ప్రముఖులంతా దర్శిస్తారు. అక్కడి విగ్రహం కూడా ప్రతి ఏటా రాజసం ఉట్టిపడేలా ఒకేలా ఉంటుంది. తొలిసారి 1934లో ఇక్కడ వినాయకుడిని ప్రతిష్టించారు. లాల్‌బాగ్చా రాజా సార్వజనిక్ గణేషోత్సవ్ మండల్ ఏటా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది.

ముంబైలోని పుత్లాబాయి చాల్ లో ఈ లాల్‌బాగ్చా రాజా మండపం ఉంటుంది. ఎనిమిది దశాబ్దాలుగా ఈ గణనాథుడిని అక్కడి కాంబ్లి కుటుంబమే చూసుకుంటోంది. ఈ గణేషుడికి వచ్చే విరాళాలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రతి ఏటా కోట్ల కొద్దీ డబ్బు, కిలోల కొద్దీ బంగారం, వెండి విరాళాలుగా రావడం విశేషం.

మరోవైపు షారుక్ ఖాన్ ఈసారి కూడా తన ఇల్లు మన్నత్ లో గణేష్ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించాడు. ఈసారి గణేష్ చతుర్థి షారుక్ ఖాన్ కు మరింత మరుపురానిదిగా నిలిచిపోయింది. గతేడాది గణేష్ చతుర్థి నుంచి ఇప్పటి వరకూ షారుక్.. రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించిన రెండు సినిమాలు అందించడం విశేషం. వీటిలో పఠాన్ రూ.వెయ్యి కోట్లు దాటగా.. జవాన్ చేరువలో ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం