తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gurthunda Seethakalam Trailer: సత్యదేవ్-తమన్నా రొమాన్స్.. గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రిలీజ్

Gurthunda Seethakalam Trailer: సత్యదేవ్-తమన్నా రొమాన్స్.. గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రిలీజ్

03 December 2022, 13:45 IST

    • Gurthunda Seethakalam Trailer: సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రిలీజ్
గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రిలీజ్

గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రిలీజ్

Gurthunda Seethakalam Trailer: టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ పక్క క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తూనే మరోపక్క హీరోగానూ అదరగొడుతున్నాడు. తాజాగా సత్యదేవ్ నటించిన తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ హీరోయిన్‌గా చేస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

Karthika Deepam Chandu: కార్తీక దీపం చందు ఆత్మ‌హ‌త్య - ప‌విత్ర జ‌యరాం చ‌నిపోయిన ఐదు రోజుల‌కే బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

Prabhas: ప్ర‌భాస్ చేతుల మీదుగా మొద‌లై రిలీజ్ కానీ దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?

గుర్తుందా శీతాకాలం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా అనిపిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ అనేది వారికి ఎంతో మధురమైన అనుభవంగా గుర్తుండిపోతుంది. అలాంటి రొమాంటిక్ క్షమాలను గుర్తుకుతెచ్చుకునేలా ఈ సినిమా ట్రైలర్ ఉంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ట్రైలర్ ఆద్యంతం అద్భుతమైన ఫీల్‌ను కలగజేస్తుంది.

లవ్‌లో ప్రాబ్లమ్ ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు.. కానీ లవరే ప్రాబ్లమ్ అయితే అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. మరీ అందంగా ఉంది రా.. మన రేంజ్ కాదురా లాంటి సంభాషణలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కన్నడలో సూపర్ హిట్టయిన లవ్ మాక్ టైల్ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది.

ఈ చిత్రంలో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించగా.. మరో హీరోయిన్లుగా మేఘా ఆకాశ్, కావ్య శెట్టి చేశారు. ప్రియదర్శ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. నాగశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం