తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sara Ali Khan: రూ.1600 పెట్టి టవల్ కొంటావా.. తల్లిపై హీరోయిన్ ఫైర్

Sara Ali Khan: రూ.1600 పెట్టి టవల్ కొంటావా.. తల్లిపై హీరోయిన్ ఫైర్

Hari Prasad S HT Telugu

05 June 2023, 15:10 IST

    • Sara Ali Khan: రూ.1600 పెట్టి టవల్ కొంటావా అంటూ తల్లిపై హీరోయిన్ సారా అలీ ఖాన్ ఫైర్ అయిందట. ఈ విషయాన్ని ఆమె లేటెస్ట్ మూవీ కోస్టార్ విక్కీ కౌశల్ వెల్లడించడం విశేషం.
నటి సారా అలీ ఖాన్, ఆమె తల్లి అమృతా సింగ్
నటి సారా అలీ ఖాన్, ఆమె తల్లి అమృతా సింగ్

నటి సారా అలీ ఖాన్, ఆమె తల్లి అమృతా సింగ్

Sara Ali Khan: బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ పేరు సంపాదించుకుంటున్న నటి సారా అలీ ఖాన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురు ఈమె. అయితే ఈ మధ్య ఓ టవల్ ను రూ.1600 పెట్టి కొనుగోలు చేసిన తన తల్లిపై ఆమె సీరియస్ అయిందట. ఈ విషయాన్ని జరా హట్కే జరా బచ్‌కే మూవీ ప్రమోషన్లలో భాగంగా విక్కీ కౌశల్ చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

ఓ ఇంటర్వ్యూలో మాట్లడిన విక్కీ.. సారా అలీ ఖాన్ గురించి ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించాడు. షూటింగ్ సందర్భంగా సారా తల్లి అమృతా సింగ్ ఓ టవల్ రూ.1600 పెట్టి కొనుగోలు చేసిందట. అది చూసి ఆమె తన తల్లిపై గట్టిగా అరిచిందని విక్కీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

"నేను ఒక రోజు ఆమె అమృతాసింగ్ మేడమ్ ను తిడుతుండటం చూశాను. ఏమైందని నేను ఆమెను అడిగాను. అప్పుడు ఆమె స్పందిస్తూ మా అమ్మకు అసలు సెన్స్ లేదు. ఆమె రూ.1600 పెట్టి ఒక టవల్ కొనుగోలు చేసింది. వానిటీ వాన్ లో రెండు, మూడు టవల్స్ ఎలాగూ ఉంటాయి. వాటిలో ఒక దానిని వాడుకోవచ్చు కదా. రూ.1600 పెట్టి ఎవరు టవల్ కొంటారు" అని సారా అన్నట్లు విక్కీ చెప్పాడు.

ఈ ఇద్దరూ కలిసి జరా హట్కే జరా బచ్కే అనే మూవీలో నటించారు. ఈ సినిమా గత శుక్రవారం (జూన్ 2) రిలీజైంది. దీనికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు కలెక్షన్లు కూడా బాగున్నాయి. తొలి రోజు రూ.5.49 కోట్లు వసూలు చేసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం