తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sammathame Movie Review:స‌మ్మ‌త‌మే రివ్యూ …పేరులోనే కొత్తదనం....

sammathame movie review:స‌మ్మ‌త‌మే రివ్యూ …పేరులోనే కొత్తదనం....

24 June 2022, 12:48 IST

  • ఈ వారం ప‌దికి పైగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డుతున్నాయి. వాటిలో స‌మ్మ‌త‌మే ఒక‌టి. కిర‌ణ్ అబ్బ‌వ‌రం, చాందిని చౌద‌రి జంట‌గా న‌టించిన ఈ సినిమా ఎలా ఉందంటే.

చాందిని చౌదరి, కిరణ్ అబ్బవరం
చాందిని చౌదరి, కిరణ్ అబ్బవరం (twitter)

చాందిని చౌదరి, కిరణ్ అబ్బవరం

ప్రస్తుతం క‌మ‌ర్షియ‌ల్ హంగుల కంటే క‌థ‌ల‌నే న‌మ్ముకుంటూ సినిమాలు చేసే ధోర‌ణి యువ‌హీరోల్లో క‌నిపిస్తోంది. ఆ సిద్దాంతాన్ని న‌మ్ముతూ కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. రాజావారు రాణిగారు, ఎస్‌.ఆర్ క‌ళ్యాణమండ‌పం సినిమాల‌తో తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రియ‌లిస్టిక్ క‌థాంశాల‌తో రూపొందిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించాయి. అత‌డు హీరోగా న‌టించిన తాజా చిత్రం స‌మ్మ‌త‌మే. గోపీనాథ్‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో చాందిని చౌద‌రి హీరోయిన్‌గా న‌టించింది. పాటలు, ప్రచార చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

కృష్ణ లవ్ స్టోరీ

కృష్ణ(కిరణ్ అబ్బవరం) జీవితం ప‌ట్ల నిర్ధిష్ట‌మైన‌ అభిప్రాయాలు క‌లిగిన ఓ యువ‌కుడు త‌న‌కు కాబోయే భార్య సంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఉండ‌ట‌మే కాకుండా త‌న‌ను మాత్ర‌మే ప్రేమించాల‌ని, గతంలో ఆమెకు ఎలాంటి లవ్ స్టోరీస్ ఉండకూడదని రూల్ పెట్టుకుంటాడు. ఆ ఆలోచ‌న‌తోనే చ‌దువుకునే రోజుల్లో తన‌కు ఐ ల‌వ్ యూ చెప్పిన అమ్మాయిల్ని తిర‌స్క‌రిస్తాడు. సాన్వీని( చాందిని చౌదరి) తొలిచూపులోనే ఇష్ట‌ప‌డ‌తాడు. సాన్వీ ఆధునిక భావాలున్న యువ‌తి. న‌చ్చిన‌ట్లుగా జీవితాన్ని లీడ్ చేస్తుంటుంది. శాన్వీని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కృష్ణ. మోడ్రన్ కల్చర్ కు దూరంగా తన ఆలోచ‌న‌ల‌కు త‌గిన‌ట్లుగా ఆమెను మార్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. కృష్ణ‌ను ఇష్ట‌ప‌డిన సాన్వీ కూడా అత‌డిని బాధ‌పెట్టడం ఇష్టం లేక చాలా విష‌యాల్ని పెళ్లికి రెడీ అవుతుంది. కానీ ఆమె చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలు అని కృష్ణ‌కు తెలుస్తుంది. ఆ త‌ర్వాత అత‌డు ఏం చేశాడు? సాన్వీ ప్రేమ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు? కృష్ణ మ‌న‌స్త‌త్వాన్ని సాన్వీ అర్థం చేసుకుందా? అత‌డి ప్రేమ‌ను యాక్సెప్ట్ చేసిందా లేదా అన్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్...

పెళ్లి విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రిలో ఎన్నో ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని జీవితంలోకి వ‌చ్చేవారిపై బ‌ల‌వంతంగా రుద్ద‌డానికి ప్ర‌య‌త్నించ‌కూడ‌దు. కాబోయే భాగ‌స్వామి ఎలా ఉన్నా య‌థాలాపంగా స్వీక‌రించాల‌నే పాయింట్‌తో రూపొందిన చిత్ర‌మిది. మ‌నకు న‌చ్చిన‌ట్లుగా ఎదుటి వారు కూడా ఉండాల‌ని అనుకుంటే ఏ బంధం కూడా ఎక్కువ రోజులు నిల‌బ‌డ‌ద‌నే అంశాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు గోపీనాథ్ రెడ్డి సినిమాను రూపొందించారు. ఈ పాయింట్‌కు ల‌వ్ స్టోరీ, కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్ జోడిస్తూ తెర‌కెక్కించారు. సున్నిత‌మైన అంశాన్ని ప్రేక్ష‌కులు బోర్ గా ఫీల్ కాకుండా ఆహ్లాదభరింగా న‌డిపించే ప్ర‌య‌త్నం చేశారు.

రాముడి లాంటి యువకుడు...

కృష్ణ అనే పేరు త‌ప్ప హీరో రాముడు లాంటి బుద్దిమంతుడైన యువ‌కుడు అంటూ అతడి క్యారెక్ట‌ర్‌ను డిఫరెంట్ గా పరిచయం చేయడం ఆకట్టుకుంటుంది. ఆడ‌పిల్ల లేని ఇంట్లో క‌ళ ఉండ‌ద‌ని తండ్రి చెప్పిన మాట‌ల‌ను బ‌లంగా విశ్వ‌సించిన కృష్ణ ... ట్రెడిషనల్ అమ్మాయి పెళ్లి చేసుకోవ‌డానికి ఎంత‌లా ఆరాట‌ప‌డ్డాడు? అలాంటి అమ్మాయి కోసం వెతికే క్ర‌మంలో అత‌డికి ఎదురైన సంఘ‌ట‌న‌ల‌తో ఫస్ట్ హాఫ్ స‌ర‌దాగా సాగిపోతుంది. రాధ లాంటి అమ్మాయిని కోరుకుంటే స‌త్య‌భామ లాంటి సాన్వీ...కృష్ణ జీవితంలోకి ఎలా వ‌చ్చింద‌నే అంశాల‌కు కామెడీ, ఎమోష‌న్ మిక్స్ చేస్తూ న‌డిపించాడు.

భిన్న మనస్తత్వాల ప్రయాణం

భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన వారు ప్రేమ‌ప్ర‌యాణంలో ఎదురైన ఒడిదుడుకుల‌ను సెకండ్ హాఫ్‌ సాగుతుంది.సాన్వీని త‌నకు న‌చ్చిన విధంగా మార్చుకోవ‌డం కోసం కృష్ణ చేసే ప్ర‌య‌త్నాలు...అత‌డి తో ప్రేమ‌ను నిల‌బెట్టుకోవ‌డం కోసం సాన్వీ చెప్పే అబ‌ద్దాల చుట్టూ క‌థ‌నాన్ని అల్లుకున్నారు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ లో త‌న త‌ప్పును కృష్ణ ఎలా తెలుసుకున్నాడ‌నే అంశాన్ని తండ్రీకొడుకుల ఎమోష‌న్‌తో చూపించారు.

రొటీన్ పాయింట్

స‌మ్మ‌త‌మే సినిమా కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ చాలా చిన్న‌ది. ఈ క‌థాంశంతో తెలుగులో గ‌తంలో చాలా సినిమాలొచ్చాయి. తెలిసిన పాయింట్‌ను కొత్త‌గా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. అందులో పూర్తిగా స‌క్సెస్ కాలేక‌పోయారు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ను స‌రిగా రాసుకోలేదు. అత‌డిలో ఉండే అభ‌ద్ర‌తాభావం, సంఘ‌ర్ష‌ణ‌ను తెర‌పై చూపించ‌డంలో చాలా చోట్ల క‌న్ఫ్యూజ‌న్ అయిన‌ట్లుగా అనిపించింది. క‌థ‌లో అంత‌ర్భాగంగా ప్ర‌థ‌మార్థంలో కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మిస్ప‌యింది. కామెడీ ట్రాక్‌ల‌పై ఆధార‌ప‌డ‌టంతో క‌థాగ‌మ‌నం పూర్తిగా ప‌క్క‌దారి ప‌ట్టింది. ద్వితీయార్థం చాలా చోట్ల‌సినిమా నెమ్మ‌దిగా సాగింది. హీరోలో మార్పు రావడానికి కారణమైన అంశాలు ఆకట్టుకోవు.

సహజ నటన...

ఊహలకు వాస్త‌వానికి మ‌ధ్య నిరంత‌రం సంఘ‌ర్ష‌ణ ప‌డే యువ‌కుడిగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ప్రేమ విషయంలో తనకు ఎదురయ్యే ప్ర‌స్టేష‌న్ నుండి చ‌క్క‌టి కామెడీ పండింది. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లోనూ ఆక‌ట్టుకున్నాడు. మోడ్ర‌న్ లైఫ్‌కు అలవాటుపడిన అమ్మాయిగా చాందిని చౌద‌రి స్టైలిష్ గా క‌నిపిస్తూనే మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. సింపుల్ ఎమోష‌న్స్ తో చాలా చోట్ల హీరోను డామినేట్ చేసింది. హీరో తండ్రి పాత్ర‌లో గోప‌రాజు ర‌మ‌ణ‌, హీరోయిన్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ గా అన్న‌పూర్ణ‌మ్మ, శివ‌న్నారాయ‌ణ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. శేఖ‌ర్‌చంద్ర సంగీతం ఈ సినిమాకు పెద్ద రిలీఫ్‌గా నిలిచింది. మెలోడీ ప్ర‌ధానంగా వ‌చ్చే పాట‌ల‌న్నీ బాగున్నాయి.

టైమ్ పాస్ ఎంటర్ టైనర్

స‌మ్మ‌త‌మే కొత్త‌ద‌నం లేని ఓ రెగ్యుల‌ర్ ల‌వ్ స్టోరీ. ఈ ప్రేమ‌క‌థ‌ చూస్తుంటే ఇదివ‌ర‌కు తెలుగు తెర‌పై వ‌చ్చిన ఎన్నో సినిమాలు గుర్తొస్తుంటాయి. పోలికలను పక్కనపెట్టి చూస్తే టైమ్‌పాస్ అవుతుంది.

రేటింగ్: 2.5/ 5

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం