తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tiger 3 Ott: ఓటీటీలోకి టైగర్ 3.. ఆ నిబంధన కారణంగా ఆలస్యం.. కానీ, పండుగ కంటే ముందే స్ట్రీమింగ్!

Tiger 3 OTT: ఓటీటీలోకి టైగర్ 3.. ఆ నిబంధన కారణంగా ఆలస్యం.. కానీ, పండుగ కంటే ముందే స్ట్రీమింగ్!

Sanjiv Kumar HT Telugu

05 January 2024, 6:37 IST

  • Tiger 3 OTT Release: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ టైగర్ 3 ఓటీటీలోకి రానుంది. అయితే డిసెంబర్ 31కే ఓటీటీలోకి రావాల్సిన టైగర్ 3 కాస్తా ఆలస్యం అయింది. ఇప్పుడు ఆ పండుగ కంటే ముందుగానే ఓటీటీలో టైగర్ 3 స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఓటీటీలోకి టైగర్ 3.. ఆ నిబంధన కారణంగా ఆలస్యం.. కానీ, పండుగ కంటే ముందే స్ట్రీమింగ్!
ఓటీటీలోకి టైగర్ 3.. ఆ నిబంధన కారణంగా ఆలస్యం.. కానీ, పండుగ కంటే ముందే స్ట్రీమింగ్!

ఓటీటీలోకి టైగర్ 3.. ఆ నిబంధన కారణంగా ఆలస్యం.. కానీ, పండుగ కంటే ముందే స్ట్రీమింగ్!

Tiger 3 Movie OTT Streaming: బాలీవుడ్ భాయిజాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రతి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన 'టైగర్ 3' సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 12న విడుదలైన 'టైగర్ 3' మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దాంతో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టలేకపోయింది. సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ మూడోసారి కలిసి నటించిన ఈ ఫ్రాంచైజీ మూవీకి కలెక్షన్స్ అంతంతమాత్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Godzilla x Kong The New Empire OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ

Jai Ganesh OTT: ఓటీటీలోకి భాగ‌మ‌తి హీరో మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులో స్ట్రీమింగ్‌

Game Changer Release Date:రామ్ కోసం భీమ్ త్యాగం...దేవ‌ర డేట్‌కు థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న గేమ్‌ఛేంజ‌ర్‌

Pawan Kalyan Vote: హెలికాప్టర్‌లో వచ్చి ఓటేసిన పవన్ కల్యాణ్ దంపతులు.. ఫొటోలు, వీడియోలు వైరల్

అయితే సల్మాన్ ప్రతి సినిమాకి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అలాగే 'టైగర్ 3'కి కూడా ఏర్పడింది. దాంతో టైగర్ 3 మూవీ మొదటి రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు వసూలు చేసింది. అప్పుడు టైగర్ 3 సినిమా షోలు చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ అయ్యాయి. కానీ, ఆ రెండు రోజుల తర్వాత టైగర్ 3 కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. అందుకు కారణం వరల్డ్ కప్ 2023 ఓ కారణం అయితే, సినిమాపై మిక్స్ డ్ టాక్ రావడం.

ఇక రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన టైగర్ 3 మూవీకి లాంగ్ రన్‌లో అన్ని భాషల్లో కలిపి ఇండియాలో రూ. 286 కోట్ల షేర్, రూ. 335 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వీటిలో ఒక హిందీ వెర్షన్ మాత్రం రూ. 286 కోట్లు కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లో రూ. 120 కోట్లు కలెక్ట్ చేసింది. అన్ని కలిపి వరల్డ్ వైడ్‌గా టైగర్ 3 సినిమాకు రూ. 450 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు టైగర్ 3 ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆసక్తి నెలకొంది. థియేటర్లలో చూడని ప్రేక్షకులు టైగర్ 3ని ఓటీటీలో చూసేందుకు ఆరాటపడుతున్నారు.

టైగర్ 3 మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు భారీ మొత్తంలో అమెజాన్ ప్రైమ్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. సాధారణంగా అన్ని సినిమాల తరహాలోనే థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో టైగర్ 3 సినిమాను స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. అంటే, నెల రోజుల తర్వాత డిసెంబర్ మూడో వారంలో లేదా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 31న టైగర్ 3 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

కానీ, బాలీవుడ్‌లో మాత్రం ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ తర్వాత కనీసం 8 వారాలు అంటే రెండు నెలలు గడిచిన తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిబంధన ఉందట. ఆ నిబంధన కారణంగానే టైగర్ 3 ఓటీటీ విడుదల ఆగిపోయిందని ప్రముఖ వెబ్‌సైట్ సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టైగర్ 3 ఓటీటీ కొత్త రిలీజ్ డేట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు టైగర్ 3 సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 5న స్ట్రీమింగ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

టైగర్ 3 చిత్రాన్ని ఓటీటీ నిబంధనలను అతిక్రమించకుండా 8 వారాల తర్వాత జనవరి 5 శుక్రవారం సాయంత్రం లేదా అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. అంటే సంక్రాంతి పండుగ రాకముందే ఓటీటీలోకి టైగర్ 3 రానుందని తెలుస్తోంది.

కాగా టైగర్ 3 సినిమాలో బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ ఎంట్రీ అందరిని అలరించిందని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే క్లైమాక్స్ ఎండింగ్‌లో కబీర్ ఖాన్‌గా హృతిక్ రోషన్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రీనా కైఫ్ నటించగా విలన్‌గా సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన టైగర్ 3కి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం