తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Losses: బాక్సాఫీస్ రికార్డులు కాదు.. సలార్‌కు అక్కడ నష్టాలే

Salaar losses: బాక్సాఫీస్ రికార్డులు కాదు.. సలార్‌కు అక్కడ నష్టాలే

Hari Prasad S HT Telugu

02 January 2024, 16:05 IST

    • Salaar losses: సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకుపైగా వసూలు చేసింది. భారీ లాభాలు అనే వార్తలే వస్తున్నాయి కానీ.. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నష్టాలు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది.
సలార్ మూవీలో ప్రభాస్
సలార్ మూవీలో ప్రభాస్ (Screengrab from YouTube/Hombale Films)

సలార్ మూవీలో ప్రభాస్

Salaar losses: ప్రభాస్ నటించిన సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుందేమో కానీ.. అతని సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ సినిమాకు నష్టాలు తప్పేలా లేవు. నిజానికి సలార్ వసూళ్లలో సుమారు రూ.200 కోట్ల వరకూ తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. అయితే వీటిలో ఎక్కువ భాగం తెలంగాణ నుంచే కావడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

2023లో రిలీజైన తెలుగు సినిమాల్లో అత్యధిక షేర్ సాధించిన మూవీగా సలార్ నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ మూవీ రూ.124 కోట్ల షేర్ వసూలు చేసింది. అయినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నష్టాలు వచ్చే పరిస్థితి ఉండటం మింగుడు పడనిదే. తెలంగాణలో మైత్రీ మూవీ మేకర్స్ సలార్ ను డిస్ట్రిబ్యూట్ చేసింది. తెలంగాణలో రూ.65 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేయగా.. ప్రస్తుతం రూ.67 కోట్ల షేర్ వసూలు చేసింది.

అంటే ఇప్పుడిప్పుడే తెలంగాణలో సలార్ లాభాల్లోకి అడుగు పెట్టింది. ఇక నుంచి వచ్చేదంతా లాభమే అనుకోవాలి. కానీ ఏపీ పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ సినిమాకు 10 నుంచి 15 శాతం నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఏపీలో సలార్ ప్రీరిలీజ్ బిజినెస్ రూ.55 కోట్లుగా ఉంది. కానీ సినిమా ఇప్పటికి కేవలం రూ.40 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.

సోమవారం (జనవరి 1)తో హాలీడే సీజన్ కూడా ముగిసింది. మంగళవారం (జనవరి 2) నుంచి సలార్ ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీకి పోటీగా పెద్ద సినిమా ఏదీ లేకపోయినా.. ఇప్పటికే 12 రోజులు కావడంతో ఇక సలార్ మానియా మెల్లగా తగ్గిపోనుంది. హిందీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ డంకీ మూవీ సలార్ ను దెబ్బ కొట్టింది.

పైగా రిలీజ్ కు ముందు ఊహించిన స్థాయిలో ప్రమోషన్లు లేకపోవడం కూడా సలార్ కు ప్రతికూలంగా మారాయి. తెలంగాణ స్థాయిలో ఏపీలో టికెట్ల రేట్లు కూడా పెంచకపోవడం కూడా అక్కడ సినిమా నష్టాల వైపు వెళ్లడానికి కారణమవుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం