తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sudheer Varma Avoid Promotions: నిర్మాతతో డైరెక్టర్ సుధీర్‌కు విభేదాలా? అందుకే 'శాకిని డాకిని' ప్రమోషన్లకు దూరమయ్యారా?

Sudheer Varma Avoid Promotions: నిర్మాతతో డైరెక్టర్ సుధీర్‌కు విభేదాలా? అందుకే 'శాకిని డాకిని' ప్రమోషన్లకు దూరమయ్యారా?

14 September 2022, 8:12 IST

    • Sudheer Varma Differences with Saakini Daakini Producer: శాకిని డాకిని చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ ఆ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. ఆయన ప్రమేయం లేకుండానే సినిమా థియేటర్లలో ఈ నెల 16న విడుదల కానుంది.
శాకిని డాకిని డైరెక్టర్ సుధీర్ వర్మ అందుకే ప్రమోషన్లకు దూరమయ్యారా?
శాకిని డాకిని డైరెక్టర్ సుధీర్ వర్మ అందుకే ప్రమోషన్లకు దూరమయ్యారా? (Twitter)

శాకిని డాకిని డైరెక్టర్ సుధీర్ వర్మ అందుకే ప్రమోషన్లకు దూరమయ్యారా?

Sudheer Varma Skips Saakini Daakini Promotions: శుక్రవారం వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల హడావిడి మాములుగా ఉండదు. మధ్యలో కరోనా కారణంగా ఆ సందడి కాస్త తగ్గినప్పటికీ.. తిరిగి సాధారణ స్థాయికి రావడంతో థియేటర్లు పునర్వైభవంతో కళ కళ లాడుతున్నాయి. అయితే ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి షురూ కానుంది. వీటిలో రెజీనా కసాండ్ర, నివేదా థామస్ కలిసి నటించిన శాకిని డాకిని కూడా ఉంది. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 16న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరిగింది. అయితే సినిమా ప్రమోషన్లలో వేటికి కూడా డైరెక్టర్ సుధీర్ వర్మ హాజరుకాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా ఎలాంటి ప్రచారంలోనూ ఆయన ప్రమేయం లేకపోవడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

Getup Srinu: ఆ ఇద్దరు హీరోలపై నమ్మకం కుదర్లేదు.. గెటప్ శ్రీను పర్ఫెక్ట్.. డైరెక్టర్ కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

Maya Petika OTT: మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ

Aquaman and the Lost Kingdom OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఫ్రీగా చూసేయండి

శాకిని డాకిని ప్రచార కార్యక్రమాలకు సుధీర్ వర్మ పూర్తిగా దూరంగా ఉన్నారు. దీంతో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో పలు రకాలు ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. నిర్మాత సునీత తాటి, సుధీర్ వర్మ మధ్య విభేదాలు తారాస్థాయిలో నెలకొన్నాయని, అందుకే డైరెక్టర్ ఈ సినిమా ప్రచారానికి దూరంగా ఉన్నారని బజ్ నడుస్తోంది.

నిర్మాత వైఖరితో విసిగిపోయిన సుధీర్.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనును కూడా పూర్తి చేయకుండా తప్పించుకున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమా షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ డైరెక్టర్‌ ప్రమేయం లేకుండానే శాకిని డాకిని చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా ట్రైలర్, టీజర్ల కంటే కూడా ఇందులో నటించిన రెజీనా కసాండ్ర వేసిన అడల్ట్ జోక్ వల్ల సినిమా గురించి అందరికీ తెలిసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెజీనా అబ్బాయిల లైంగిక సామర్థ్యం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. "మ్యాగీ లాగానే.. అబ్బాయిలు కూడా రెండు నిమిషాల్లోనే అయిపోతారు" అంటూ కామెంట్ చేసింది. ఆమె చేసిన కామెంట్ సదరు యాంకర్‌కు అర్థం కాక.. నిజమే అంటూ తలూపాడు. మీకు అర్థం కాలేదు నా జోక్ అనగానే.. నాకు అర్థమైంది ఇప్పుడు అంటూ తలపట్టుకున్నాడు.

సురేశ్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా శాకిని డాకిని చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డీ సురేశ్ బాబు, సునీత తాటి, హ్యూన్యూ థామస్ కిమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు మైకీ మెక్ క్లియర్, నరేశ్ కుమారన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం