తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rules Ranjan Ott Release Date: రూల్స్ రంజన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో చూడాలంటే?

Rules Ranjan OTT Release Date: రూల్స్ రంజన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో చూడాలంటే?

Hari Prasad S HT Telugu

29 November 2023, 15:35 IST

    • Rules Ranjan OTT Release Date: రూల్స్ రంజన్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా బుధవారం (నవంబర్ 29) ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను ఆహా ఓటీటీ రివీల్ చేసింది.
ఆహా ఓటీటీలోకి వచ్చేస్తున్న రూల్స్ రంజన్ మూవీ
ఆహా ఓటీటీలోకి వచ్చేస్తున్న రూల్స్ రంజన్ మూవీ

ఆహా ఓటీటీలోకి వచ్చేస్తున్న రూల్స్ రంజన్ మూవీ

Rules Ranjan OTT Release Date: కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ మూవీ మొత్తానికి ఓటీటీలో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా గురువారం (నవంబర్ 30) సాయంత్రం 6 గంటలకు డిజిటల్ ప్రీమియర్ ఉండనున్నట్లు ఆహా ఓటీటీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Super Star Krishna: అమెరికాలో తీసిన తొలి తెలుగు సినిమా.. 44 ఏళ్ల నాటి సూపర్ స్టార్ కృష్ణ మూవీ ఏదంటే?

OG Movie: ఓజీ సినిమాలో టబు చేయాల్సిన క్యారెక్టర్ ఎవరికి వెళ్లిందో తెలుసా?

OTT Heroine: ఓటీటీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్.. ఆమె ముందు స్టార్ హీరోలు సైతం దిగదుడుపే!

NTR Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై కీలక అప్‍డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పటి నుంచో చెప్పిన టీమ్

రూల్స్ రంజన్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని ఆహా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "రూల్స్ బుక్ ను తిరగ రాయడానికి రూల్స్ రంజన్ వచ్చేస్తున్నాడు. రూల్స్ రంజన్ ప్రీమియర్ నవంబర్ 30 సాయంత్రం 6 గంటలకు" అని చెప్పింది. నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫెయిల్యూర్ మూటగట్టుకుంది.

ల‌వ్ స్టోరీలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, కామెడీ ఆశించిన స్టాయిలో వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో రూల్స్ రంజ‌న్ డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ఫ‌స్ట్ వీక్‌లోనే థియేట‌ర్ల‌లో క‌నిపించ‌కుండాపోయింది. థియేట‌ర్ రిజ‌ల్ట్ కార‌ణంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆల‌స్య‌మైన‌ట్లు స‌మాచారం. రూల్స్ రంజ‌న్ సినిమాలో నేహా శెట్టి తో పాటు మెహ‌ర్ చాహ‌ల్ హీరోయిన్లుగా న‌టించారు.

సుబ్బ‌రాజు, హ‌ర్ష చెముడు, హైప‌ర్ ఆది కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎమ్ ర‌త్నం త‌న‌యుడు జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గ‌తంలో గోపీచంద్ ఆక్సిజ‌న్‌, నీ మ‌న‌సు నాకు తెలుసుతో పాటు మ‌రికొన్ని సినిమాల‌కు జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మీట‌ర్‌, రూల్స్ రంజ‌న్‌ల‌తో బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఖాతాలో చేరాయి.

దాదాపు నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రూల్స్ రంజ‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైంది. కేవ‌లం కోటిన్న‌ర వ‌ర‌కు మాత్ర‌మే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌లకు న‌ష్టాల‌ను మిగిల్చింది. మీట‌ర్‌, రూల్స్ రంజ‌న్ సినిమాల రిజ‌ల్ట్‌ల‌తో సంబంధం లేకుండా కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్ర‌స్తుతం మూడు సినిమాల్లో న‌టిస్తుండటం విశేషం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం