తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr In Uk Best Movies List: యూకే బెస్ట్‌ మూవీస్‌ 2022 టాప్‌ 10లో ఆర్‌ఆర్ఆర్‌

RRR in UK Best Movies List: యూకే బెస్ట్‌ మూవీస్‌ 2022 టాప్‌ 10లో ఆర్‌ఆర్ఆర్‌

HT Telugu Desk HT Telugu

15 December 2022, 14:46 IST

    • RRR in UK Best Movies List: యూకే బెస్ట్‌ మూవీస్‌ 2022 టాప్‌ 10లో ఆర్‌ఆర్ఆర్‌ చోటు దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సృష్టిస్తున్న ప్రభంజనానికి ఇది తాజా నిదర్శనం.
ఆర్ఆర్ఆర్ మూవీ
ఆర్ఆర్ఆర్ మూవీ

ఆర్ఆర్ఆర్ మూవీ

RRR in UK Best Movies List: ఇండియన్‌ సినిమా సత్తా ఏంటో చాటుతోంది ఆర్‌ఆర్ఆర్‌. అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీ సృష్టిస్తున్న సంచలనాలకు అడ్డే లేకుండా పోతోంది. యూకే, అమెరికా, జపాన్‌లాంటి దేశాల్లో ట్రిపుల్‌ ఆర్‌ మాయ చేస్తోంది. ఇప్పటికే ఇంటర్నేషనల్‌ లెవల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకోవడంతోపాటు గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్ అవార్డుల్లో నామినేషన్లు కూడా పొందింది.

ట్రెండింగ్ వార్తలు

Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

తాజాగా యూకే బెస్ట్‌ మూవీస్‌ 2022 లిస్ట్‌లోనూ ఈ సినిమా చోటు దక్కించుకుంది. బ్రిటిష్‌ మ్యాగజైన ది గార్డియన్‌ ఈ మధ్యే 2022లో వచ్చిన 50 బెస్ట్‌ ఫిల్మ్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌కు కూడా స్థానం కల్పించింది. ఈ జాబితాలో 2022లో యూకేలో రిలీజైన సినిమాలు ఉన్నాయి. అంతేకాదు టాప్‌ 10లో ట్రిపుల్‌ ఆర్‌ నిలవడం విశేషం. రాజమౌళి సృష్టించిన ఈ అద్భుతానికి ఏడో స్థానం దక్కింది.

ఈ ఏడాది హాలీవుడ్‌లో రిలీజైన టాప్‌ గన్‌ మావెరిక్‌, గ్లాస్‌ ఆనియన్‌: ఎ నైవ్స్‌ ఔట్‌ మిస్టరీ, కౌ, ఫైర్‌ ఆఫ్‌ లవ్‌, ది నార్త్‌మ్యాన్‌, బోన్స్‌ అండ్‌ ఆల్‌, ది వండర్‌లాంటి మూవీస్‌ కంటే కూడా పైన ఉంది ఈ ఆర్ఆర్‌ఆర్‌. ఈ లిస్ట్‌లో టాప్‌ 6లో ఉన్న మూవీస్‌ లిస్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ సినిమాలో లీడ్‌ రోల్స్‌ నటించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కూడా యూకే టాప్‌ 50 సౌత్‌ ఏషియన్‌ స్టార్స్‌ లిస్ట్‌లో టాప్‌లో నిలిచిన విషయం తెలిసిందే.

ఇప్పుడా మూవీకి కూడా టాప్‌ 10లో చోటు దక్కింది. దీనికి తోడు గోల్డెన్‌ గ్లోబ్స్‌, క్రిటిక్స్ ఛాయిస్‌ అవార్డుల్లో నామినేషన్లతో ట్రిపుల్‌ ఆర్‌ మరో లెవల్‌కు చేరుకుంది. ఇక మిగిలింది ఆస్కార్స్‌ నామినేషన్లే. దీనికోసం రాజమౌళితోపాటు మేకర్స్‌ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రూ.50 కోట్ల వరకూ ఖర్చు కూడా చేసినట్లు సమాచారం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం