తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Golden Globe Awards: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌కు హాజ‌రుకానున్న రామ్‌చ‌ర‌ణ్ , ఎన్టీఆర్‌

Ram Charan Golden Globe Awards: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌కు హాజ‌రుకానున్న రామ్‌చ‌ర‌ణ్ , ఎన్టీఆర్‌

02 January 2023, 22:10 IST

  • Ram Charan Golden Globe Awards: హాలీవుడ్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ ప్ర‌దాన‌త్సోత వేడుక‌ల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ సంద‌డి చేయ‌బోతున్న‌ది. ఈ అవార్డ్ వేడుక కోసం స్పెష‌ల్‌గా సిద్ధం చేసిన డ్రెస్‌ను సోమ‌వారం సోష‌ల్ మీడియాలో రామ్ చ‌ర‌ణ్ షేర్ చేశాడు.

రామ్ చ‌ర‌ణ్
రామ్ చ‌ర‌ణ్

రామ్ చ‌ర‌ణ్

Ram Charan Golden Globe Awards: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌తో కొత్త ఏడాదిని మొద‌లుపెట్ట‌బోతున్నాడు మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్‌. ఆస్కార్ త‌ర్వాత హాలీవుడ్‌లో గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాల‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుంటారు. ఆస్కార్‌కు క‌ర్టెన్ రైజ‌ర్‌గా ఈ అవార్డుల‌ను అభివ‌ర్ణిస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాల వేడుక అమెరికాలో జ‌న‌వ‌రి 10న జ‌రుగ‌నుంది. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌కు రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయ్యింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్‌తో పాటు బెస్ట్ ఒరిజిన‌ల్‌ సాంగ్ (నాటు నాటు)విభాగాల్లో పోటీప‌డుతోంది. ఈ రెండు కేట‌గిరీలో ఏదో ఒక విభాగంలో ఆర్ఆర్ఆర్ అవార్డును గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని హాలీవుడ్ సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కాగా ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ హాజ‌రుకాబోతోంది. హీరోలు రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో పాటు మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి అటెండ్ అవుతోన్నారు. ఈ అవార్డ్ వేడుక కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ స్పెష‌ల్‌గా డ్రెస్‌ల‌ను సిద్ధం చేసింది. ఈ డ్రెస్ ధ‌రించిన ఫోటోను సోష‌ల్ మీడియాలో రామ్ చ‌ర‌ణ్ షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ లోగో ఉన్న బ్లాక్ క‌ల‌ర్ రాయ‌ల్ సూట్‌లో రామ్ చ‌ర‌ణ్ స్టైలిష్‌గా క‌నిపిస్తోన్నారు.

గ్లోబ్ అవార్డు వేడుక‌కు ముందురోజు అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఉన్న టీఎల్‌సీ చైనీస్‌ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్‌ స్క్రీనింగ్‌ జరగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ కావడం విశేషం. ఈ స్పెష‌ల్ స్క్రీనింగ్‌కు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, రాజ‌మౌళితో పాటు కీర‌వాణి హాజ‌రుకానున్నారు.

మ‌రోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ రేసులో నిలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు బ‌లంగా వార్త‌లు వినిపిస్తోన్నాయి. ఇప్ప‌టికే ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ షార్ట్ లిస్ట్‌లో నాటు నాటు పాట‌కు స్థానం ద‌క్కింది. మ‌రికొన్ని విభాగాల‌ను ఈ నెల‌లోనే అనౌన్స్ చేయ‌బోతున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం