తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv On Prasanth Varma: హనుమాన్‍తో అది నిరూపించావ్.. పాఠం నేర్పావ్: ప్రశాంత్ వర్మపై ఆర్‌జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

RGV on Prasanth Varma: హనుమాన్‍తో అది నిరూపించావ్.. పాఠం నేర్పావ్: ప్రశాంత్ వర్మపై ఆర్‌జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

13 January 2024, 21:34 IST

    • Ram Gopal Varma on HanuMan Movie: హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మపై డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. సినీ ఇండస్ట్రీకి ఓ పాఠం నేర్పావంటూ పొగిడారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
రామ్‍గోపాల్ వర్మ - హనుమాన్ సినిమా
రామ్‍గోపాల్ వర్మ - హనుమాన్ సినిమా

రామ్‍గోపాల్ వర్మ - హనుమాన్ సినిమా

Ram Gopal Varma on HanuMan Movie: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. శుక్రవారం (జనవరి 12) థియేటర్లలో పాన్ వరల్డ్ రేంజ్‍లో ఈ మూవీ విడుదలైంది. హనుమంతుడి ఆధారంగా వచ్చిన ఈ మైథలాజికల్ సూపర్ హీరో మూవీకి అద్భుత స్పందన వస్తోంది. హనుమాన్‍ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా పేరు మార్మోగుతోంది. అందరూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఈ జాబితాలోకి ప్రముఖ దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ కూడా చేరారు. తన మార్క్ కామెంట్లతో ప్రశాంత్‍ను ఆయన ప్రశంసించారు.

ట్రెండింగ్ వార్తలు

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

Getup Srinu: ఆ ఇద్దరు హీరోలపై నమ్మకం కుదర్లేదు.. గెటప్ శ్రీను పర్ఫెక్ట్.. డైరెక్టర్ కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

ఆలోచనా శక్తి ఉంటే తక్కువ బడ్డెట్‍తో కూడా వీఎఫ్‍ఎక్స్ ఎక్కువగా ఉండే చిత్రాలు తెరకెక్కించవచ్చని హనుమాన్‍తో ప్రశాంత్ వర్మ నిరూపించారని రామ్‍గోపాల్ వర్మ చెప్పారు. ఇలాంటి చిత్రాలు తీయాలంటే వందల కోట్ల బడ్జెట్ అవసరమని భావించే వారికి చెంపదెబ్బలా హనుమాన్‍ను తీసుకొచ్చారని అన్నారు. ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పాఠం నేర్పావంటూ ప్రశాంత్ వర్మకు ఆర్జీవీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

భారీ సినిమాలు పోటీలో ఉన్నా హనుమాన్ బ్లాక్‍బాస్టర్ అవుతుండడంపై కూడా ఆర్జీవీ అభినందించారు. గొలియత్‍ను డేవిడ్ అంతమొందించిన లాంటిదే ఇది అని చెప్పారు. నిరంతర శ్రమ, తెలివి ఉంటే తక్కువ బడ్జెట్‍తోనే హనుమాన్ లాంటి చిత్రాలు తెరకెక్కించవచ్చని ప్రశాంత్ వర్మ చేసి చూపించారని చెప్పారు.

“ఈ సినిమా కమర్షియల్‍గా బ్లాక్‍బాస్టర్ అవడం కన్నా ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. పరిమిత బడ్జెట్‍లోనే ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించారని మరిచిపోకూడదు. వీఎఫ్‍ఎక్స్ ఎక్కువగా ఉండే సినిమాలు తీయాలంటే రూ.300 కోట్లు, రూ.500 కోట్లు కావాలని కొందరు చెబుతుంటారు. అయితే, తక్కువ బడ్జెట్‍తో వీఎఫ్‍ఎక్స్ హెవీ మూవీ తీయాలంటే తెలివి చాలని ప్రశాంత్ వర్మ నిరూపించారు. సమగ్రత, నిజాయితీ, నిరంతరశ్రమ, పట్టుదల ఉంటే ఇది సాధ్యం చేయొచ్చని చెప్పారు” అని రామ్‍గోపాల్ వర్మ అన్నారు.

చెంపదెబ్బ లాంటిది

వీఎఫ్ఎక్స్‌తో మూవీ తీయాలంటే భారీ బడ్జెట్ కావాలని చెప్పే వారందరికీ హనుమాన్ చెంపదెబ్బ లాంటిదని రామ్‍గోపాల్ వర్మ అన్నారు. “ఇలాంటి చిత్రం తీయాలంటే ఏం కావాలని (భారీ బడ్జెట్) సినీ పరిశ్రమ ఇంతకాలం నమ్మిన విషయాలకు ఇది చెంపదెబ్బ లాంటిది. ఇందుకోసం ప్రశాంత్‍ను నేను అభినందించాలనుకుంటున్నా. ఈ సినిమా కోసం మాత్రమే కాదు.. ఇండస్ట్రీలోని వారికి పాఠం నేర్పినందుకు కూడా. సినిమాలకు (వేరే సినిమాల విషయంలో) ఇంత బడ్జెట్ ఎందుకు అవుతోందని ఇప్పటి నుంచి చాలా మంది ప్రశ్నిస్తారు. ఇది నిర్మాతలకు కూడా చాలా మంచి విషయం. ఇండస్ట్రీ మొత్తం తరఫునుంచి మీకు (ప్రశాంత్ వర్మ) ధన్యవాదాలు” అని రామ్‍గోపాల్ వర్మ అన్నారు.

హనుమాన్ సినిమా సుమారు రూ.50కోట్ల బడ్జెట్‍తోనే రూపొందింది. అయితే, ఈ పరిమిత బడ్జెట్‍లో అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఔట్‍పుట్ సాధించడం పట్ల డైరెక్టర్ ప్రశాంత్ వర్మను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో హనుమంతుడిని చూపించిన విధానం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ చిత్రంలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం