తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Met Cancer Child: చరణ్ పెద్ద మనస్సు.. క్యాన్సర్ చిన్నారిని కలిసి ధైర్యాన్నిచ్చిన మెగా పవర్ స్టార్

Ram Charan met Cancer Child: చరణ్ పెద్ద మనస్సు.. క్యాన్సర్ చిన్నారిని కలిసి ధైర్యాన్నిచ్చిన మెగా పవర్ స్టార్

10 February 2023, 5:29 IST

    • Ram Charan met Cancer Child: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి పెద్ద మనస్సు చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారిని కలిసి అతడిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
క్యాన్సర్ చిన్నారిని కలిసిన రామ్ చరణ్
క్యాన్సర్ చిన్నారిని కలిసిన రామ్ చరణ్

క్యాన్సర్ చిన్నారిని కలిసిన రామ్ చరణ్

Ram Charan met Cancer Child: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. గతేడాది ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఆచార్య నటించిన అతడు డిజాస్టర్ సొంతం చేసుకున్నాడు. దీంతో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బుల్లి అభిమానిని కలవడానికి వచ్చాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారిని కలిసి అతడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు. కాసేపు పిల్లాడితో ముచ్చట్లు పెట్టి సరదాగా గడిపాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Anushka: అరుంధ‌తిలో అనుష్క ఫ‌స్ట్ ఛాయిస్ కాదు - ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని మిస్‌ చేసుకున్న మ‌ల‌యాళం హీరోయిన్ ఎవ‌రంటే?

మణి కౌశల్ అనే చిన్నారి క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా రామ్ చరణ్ ఆ బుడ్డోడి కోరికను తెలుసుకున్నాడట. తన అభిమాని అలాంటి స్థితిలో ఉండటంతో చరణ్ కదిలి వచ్చాడు. చిన్నారి క్యాన్సర్ మీద చేస్తోన్న పోరాటంలో అతడికి కొండంత బలం ఇచ్చేందుకు చరణ్ వచ్చాడు.

చిన్నారితో కాసేపు మాట్లాడి అతడిలో ధైర్యంతో పాటు విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు రామ్ చరణ్. అభిమానికి ఇలా సడెన్ సర్ ప్రైజ్ ఇవ్వడం, ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వడంతో ఆ చిన్నారి కళ్లలో కోటి దీపాలు వెలిగాయట. సోషల్ మీడియా ఈ ఫొటో వైరల్ కావడంతో నెట్టింట అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. RC15గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ చార్మినార్ సమీపంలో షూటింగ్ జరిగింది. అభ్యుదయ పార్టీ ప్రచార ఎన్నికల సన్నివేశాన్ని రూపొందించినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు లీక్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు లీకులు నెట్టింట హల్చల్ చేయగా.. దిల్ రాజు టీమ్ ఎంత కష్టపడినా ఇవి మాత్రం ఆగడం లేదు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం