RC15 Movie Update: రామ్ చరణ్-శంకర్ కాంబో నుంచి క్రేజీ అప్డేట్.. భారీ సాంగ్‌కు ప్లాన్
RC15 Movie Update: రామ్ చరణ్-శంకర్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. చరణ్ కోసం శంకర్ ఓ భారీ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. దీన్ని మంది డ్యాన్సర్లతో తీయనున్నారట.
RC15 Movie Update: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా.. కమల్ హాసన్ ఇండియన్ 2 కారణంగా తాత్కాలికంగా ఆగిపోయింది. దీంతో చరణ్ కొత్త కథలు వింటున్నారు. ఇప్పటికే ఉప్పెన దర్శకుడు ఉప్పెన సానంతో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. ఇదిలా ఉంటే మరోసారి మరోసారి రామ్ చరణ్- శంకర్ కాంబోపై ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఇండియన్-2 షూటింగ్ ఇటీవలే పూర్తయిందని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. దీంతో రామ్ చరణ్‌తో సినిమాను తిరిగి పట్టాలెక్కించే పనిలో పడ్డారట శంకర్.
ట్రెండింగ్ వార్తలు
కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం శంకర్-రామ్ చరణ్ మూవీ త్వరలోనే తిరిగి పునఃప్రారంభం కానుందని తెలుస్తోంది. ముందుగా చరణ్‌పై ఓ భారీ సాంగ్‌ను చిత్రీకరించేందుకు పనులు ప్రారంభించారట డైరెక్టర్. ఇందుకోసం 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ వారం చివర్లోనే ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే బడ్జెట్ పరంగా ఖర్చు విషయంలో దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు మధ్య విభేధాలు తలెత్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే శంకర్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేకూరేలా ఆయన సినిమా గ్రాండ్‌గా కనిపిస్తుంది. భారీ స్థాయిలో పాటల చిత్రీకరణలో ప్రత్యేకమైన ఆలోచనలతో శంకర్‌కు మంచి గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో విజువల్ ఓరియెంటెడ్ రోబో 2.0, ఐ లాంటి మూవీస్ తీశారని కానీ.. ప్రారంభంలో సామాజిక అంశాలను స్పశిస్తూ వాటిని కమర్షియల్ మూవీస్ తరహాలో తీర్చిదిద్దడం శంకర్ ప్రత్యేక శైలి. రామ్ చరణ్‌తో సినిమా కూడా ఇదే కోవలో రాబోతుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. చెర్రీతో కియారాకు ఇది రెండో సినిమా. ఇంతకుముందు వినయ విధేయ రామలో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్ వస్తోన్న ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో చరణ్ రెండు విభిన్న సినిమాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్, అంజలి, జయరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సంబంధిత కథనం