తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyanka Necklace Cost: ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ఎంతో తెలుసా? కాస్ట్ చూసి షాక్ అవ్వాల్సిందే..!

Priyanka Necklace Cost: ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ఎంతో తెలుసా? కాస్ట్ చూసి షాక్ అవ్వాల్సిందే..!

03 May 2023, 5:52 IST

    • Priyanka Necklace Cost: బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ఇటీవల మెట్ గాలా ఈవెంట్‌‍కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ధరించిన నెక్లెస్ అందరి దృష్టి ఆకర్షించింది. దీని కాస్ట్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.
మెట్ గాలా ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా
మెట్ గాలా ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా (AFP)

మెట్ గాలా ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా

Priyanka Necklace Cost: బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka chopra) నాలుగు పదుల వయస్సు దాటినా ఈ ముద్దుగుమ్మ తన అందంతో వెస్టర్న్ ఆడియెన్స్‌ను ఫిదా చేస్తోంది. ఇటీవలే ప్రియాంక నటించిన సిటడెల్ అనే వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైంది. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ షో మెట్ గాలా 2023(Met Gala 2023) వేడుకకు హాజరైంది. అంతేకాకుండా అబ్బురపరిచే దుస్తుల్లో ధరించిన ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే అందరి చూపు ఆమె ధరించిన నెక్లెస్‌పైనే ఉంది. సోషల్ మీడియాలో కూడా ప్రియాంక ధరించిన నెక్లెస్(Priyanka Necklace) గురించి చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

ప్రియాంక చోప్రా బుల్గారి సిరీస్‌కు చెందిన 11.6 క్యారెట్ల డైమండ్ నెక్లెస్‌ను ధరించినట్లు తెలుస్తోంది. మెట్ గాలా ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ప్రత్యేకంగా ఉండేలా ఈ నెక్లెస్‌ను ఎంచుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో చూసిన ప్రతి ఒక్కరూ నెక్లెస్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో నెక్లెస్ ధర(Priyanka Necklace Cost) గురించి విశేషంగా చర్చించుకుంటున్నారు.

ట్విటర్‌లో ఓ యూజర్ పోస్ట్ ప్రకారం ప్రియాంక ధరించిన ఈ నెక్లెస్ ధర దాదాపు 25 మిలియన్ల యూఎస్ డాలర్లు ఉంటుందని అంచనా. భారత కరెన్సీలో దాదాపు రూ. 204 కోట్లు. ఈ ధర తెలుసుకున్న నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఒక్క నెక్లెస్ రూ. 200 కోట్లా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. మెట్ గాలా ఈవెంట్ అనంతరం ఈ డైమండ్ నెక్లెస్‌కు వేలం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా సెక్సీ బ్లాక్ గౌనులో మెరిసింది. తొడ అందాలు కనిపించేలా ఆ గౌనుకు చీలిక ఉంది. ఫలితంగా అందరి దృష్టి ఆమెపైనే పడింది. ప్రముఖ డిజైనర్ వాలెంటినో రూపొందించిన ఈ దుస్తుల్లో ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన భర్త నిక్ జోనాస్‌తో(Nick Jonas) కలిసి ఈ వేడుకకు హాజరైంది బ్యూటీ. ఇద్దరూ కలిసి రెడ్ కార్పెట్‌పై కెమెరాకు ఫోజులిచ్చారు.

కెరీర్ విషయానికొస్తే ప్రియాంక చోప్రా సిటడెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇది గత నెల 28 నుంచి ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో ప్రియాంక నటనకు ఫిదా అవుతున్నారు.

భర్త నిక్‌తో ప్రియాంక
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం