Priyanka eats in Bath Room: బాత్ రూమ్‌లో కూర్చొని ఫుడ్ తినేదాన్ని.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్
Priyanka eats in Bath Room: బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా హైస్కూల్ విద్య కోసం తను మొదటి సారి అమెరికాకు వెళ్లినప్పుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని పేర్కొంది. బాత్ రూమ్‌లో కూర్చొని ఫుడ్ తినేదాన్ని అని తెలిపింది.
Priyanka eats in Bath Room: బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది. పోష్ ఇంగ్లీష్‌తో వెస్టర్న్ భామలకు తను ఏ మాత్రం తక్కువ కాదనేంతలా ఆకట్టుకుంటోంది. పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో వివాహమైన తర్వాత ఇంకా ఓపెన్ అయిన ఈ బ్యూటీ ఒకప్పుడు ఇంట్రోవర్ట్ అనే సంగతి మీకు తెలుసా? అవును ఒకప్పుడు ప్రియాంక ఏ విషయాన్నైనా బయటకు చెప్పేందుకు ఇబ్బంది పడేదంట. అమెరికా వెళ్లిన కొత్తలో అయితే పక్కవారితో ఎలా స్నేహంగా ఉండాలో తెలిసేది కాదట. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రానే చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు
"హైస్కూల్ విద్య కోసం అమెరికాకు వెళ్లినప్పుడు కొత్తలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అక్కడ ఆడవారితో ఎలా స్నేహంగా ఉండాలో మొదట అర్థం కాలేదు. క్యాంటీన్‌కు వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో అప్పట్లో నాకు తెలియదు. వెండింగ్ మిషన్ నుంచి స్నాక్స్ తీసుకొని ఎవరూ చూడకుండా బాత్రూమ్‌లోకి వెళ్లి తినేసి క్లాస్ రూమ్‌కు వెళ్లేదాన్ని. అలా చాలా రోజుల పాటు వేరే వాళ్లతో కలిసి తిరగలేదు. నాకున్న భయంతో అలా ఉండాల్సి వచ్చేది." అని ప్రియాంక చోప్రా తెలిపారు.
చిన్న చిన్న అమెరికన్ కల్చర్‌కు అలవాటు పడ్డానని ప్రియాంక అన్నారు. "ఎవరితోనూ కలవకపోవడం వల్ల ఇబ్బందిగా అనిపించేది. అందుకే సుమారు నాలుగు వారాలు అక్కడ ప్రతి విషయాన్ని గమనించాను. ఆ తర్వాత నాలో ధైర్యం పెరిగింది. స్కూల్‌లో ఉన్న ఇతర పిల్లలతో స్నేహం కోసం ఎంతగానో మారాను. డేట్‌కు వెళ్లడం, లేట్ నైట్ పార్టీలు.. లాంటివి మా కుటుంబంలో అనుమతించరని మా ఫ్రెండ్స్‌కు అర్థమయ్యేలా చెప్పాను" అని ప్రియాంక చోప్రా వెల్లడించారు.
కెరీర్ విషయానికొస్తే ప్రియాంక చోప్రా సిటడెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇది శుక్రవారం నుంచి ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో ప్రియాంక నటనకు ఫిదా అవుతున్నారు.