తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Release Date: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - స‌లార్ రిలీజ్ డేట్‌లో ఛేంజ్ లేదు - మేక‌ర్స్ క్లారిటీ

Salaar Release Date: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - స‌లార్ రిలీజ్ డేట్‌లో ఛేంజ్ లేదు - మేక‌ర్స్ క్లారిటీ

21 January 2023, 22:47 IST

  • Salaar Release Date: ప్ర‌భాస్ స‌లార్ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌ల‌పై శ‌నివారం మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. రిలీజ్ డేట్‌లో మార్పు లేదని ప్ర‌క‌టించారు.

ప్ర‌భాస్
ప్ర‌భాస్

ప్ర‌భాస్

Salaar Release Date: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు స‌లార్ టీమ్ గుడ్‌న్యూస్ వినిపించింది. ఈ సినిమా పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు జ‌రుగుతోన్న ప్ర‌చారాన్ని ఖండించింది. గ్యాంగ్‌స్టార్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్ర‌శాంత్‌నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డ‌నున్న‌ట్లు కొంత‌కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

షూటింగ్ ఆల‌స్యమ‌య్యే అవ‌కాశం ఉండ‌టంతో సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మే నంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌కు చిత్ర యూనిట్ పుల్‌స్టాప్ పెట్టింది. స‌లార్ సినిమాను మ‌రో 250 రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాబోతున్న‌ట్లు అనౌన్స్‌చేసింది.

స‌లార్ యూనిట్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌తో ప్ర‌భాస్ అభిమానుల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం స‌లార్ షూటింగ్ హైద‌రాబాద్‌లోని రామెజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోంది. ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్‌సుకుమార‌న్‌ల‌పై కీలక స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాలో వ‌ర‌దా రాజా మ‌న్నార్ అనే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో పృథ్వీరాజ్‌సుకుమార‌న్ క‌నిపించ‌బోతున్నాడు.

శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. హోంబ‌లే ఫిల్మ్స్ ప‌తాకంపై విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో ద‌క్షిణాదిభాష‌ల‌తో పాటు హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

స‌లార్‌తో పాటు ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు ప్ర‌భాస్‌. అలాగే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం