తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Srinivasa Murthy Passes Away: ఇండస్ట్రీలో మరో విషాదం.. డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూత.. సూర్యకు వాయిస్

Srinivasa Murthy Passes Away: ఇండస్ట్రీలో మరో విషాదం.. డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూత.. సూర్యకు వాయిస్

27 January 2023, 12:34 IST

    • Srinivasa Murthy Passes Away: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి చెన్నైలోని ఆయన నివాసంలో మృతి చెందారు. సూర్య, అజిత్, విక్రమ్ సహా పలువురు డబ్బింగ్ హీరోలకు ఆయన తన గొంతును అరువిచ్చారు. సూర్య నటించిన సింగం సిరీస్‌లో ఆయన చెప్పే డైలాగులకు ప్రేక్షకులు ఇప్పటికీ ఫిదా అవుతున్నారు.
సూర్యకు వాయిస్ ఇచ్చే డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతి
సూర్యకు వాయిస్ ఇచ్చే డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతి

సూర్యకు వాయిస్ ఇచ్చే డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతి

Srinivasa Murthy Passes Away: చిత్రసీమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. తెలుగుతెరపై ఎన్నో చిత్రాల్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆయన సుపరిచితుడు. స్ట్రెయిట్ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలతోనూ ఆయన తన గాత్రాన్ని అందించారు. ముఖ్యంగా సూర్య, అజిత్ సినిమాలకు రెగ్యూలర్‌గా తన గాత్రాన్ని అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన మృతి పట్ల తెలుగు, తమిళ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

సూర్య నటించిన సింగం సిరీస్‌ను శ్రీనివాస మూర్తి గొంతు లేకుండా అస్సలు ఊహించలేం. ఆవేశంతో మాట్లాడే ఆయన వాయిస్‌ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. సూర్య, అజిత్, విక్రమ్‌తో పాటు జనతా గ్యారేజ్‌లో మోహన్ లాల్‌కు తన గొంతును అరువిచ్చారు శ్రీనివాస మూర్తి. తెరపై ఆయన మాట మాత్రమే వినిపించే ఈ డబ్బింగ్ కళాకారుడి గొంత ఇకపై వినిపించిందంటే జీర్ణించుకోవడం కష్టమే.

ఆయన లైవ్‍‌లో డబ్బింగ్ చెబుతుంటే తమిళ హీరోలంతా మన కళ్ల ముందు కదులుతుంటారు. తమిళ హీరోలకే కాకుండా పలు హాలీవుడ్ సినిమాలకు కూడా ఆయన తన గొంతును అరువిచ్చారు. అవేంజర్స్ సిరీస్‌లో ఐరన్ మ్యాన్‌కు డబ్బింగ్ చెప్పింది శ్రీనివాస మూర్తినే. విల్ స్మిత్, జేసన్ స్టాథమ్, రాబర్ట్ డౌనీ జూనియర్ లాంటి హాలీవుడ్ స్టార్లకు రెగ్యూలర్‌గా ఆయన డబ్బింగ్ చెప్పారు.

పాత్రకు తగినట్లుగా డబ్బింగ్ చెప్పడంతో శ్రీనివాసమూర్తి సిద్ధహస్తులు. ఎమోషనల్ సీన్లలో తన గొంతుతోనే ఆ సీన్ మొత్తాన్ని పండించేశారు. చాలా సినిమాలు, చాలా పాత్రలకు ఆయన చెప్పేవరకు ప్రేక్షకులు కూడా కనుక్కోలేరు. అంతగా వాయిస్‌లో వేరియేషన్ చూపించారు. శ్రీనివాస మూర్తి చిత్రసీమలో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం