తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Koti: విలన్‌గా మారిన కోటి.. 'పగ'బట్టిన మ్యూజిక్ డైరెక్టర్

Koti: విలన్‌గా మారిన కోటి.. 'పగ'బట్టిన మ్యూజిక్ డైరెక్టర్

12 August 2022, 17:48 IST

    • టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విలన్‌గా మారారు. పగ పగ పగ అనే సినిమాలో ఆయన ప్రతినాయుకుడి పాత్రను పోషించారు. తాజాగా ఈ సినిమాలో కోటి లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
విలన్‌గా కోటి
విలన్‌గా కోటి (Twitter)

విలన్‌గా కోటి

టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుల్లో కోటి ఒకరు. 80, 90వ దశకాల్లో కోటి అద్భుతమైన సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఆయన దగ్గర ఏఆర్ రెహమాన్ లాంటి లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్లు శిష్యరికం చేశారు. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టుతో ముందుకు రానున్నారు. అయితే ఈ సారి సంగీత దర్శకుడిగా కాదు.. నటుడిగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇందులో కోటి విలన్ రోల్‌లో కనిపించనున్నారు. పగ పగ పగ అనేది ఈ సినిమా టైటిల్. అభిలాశ్ సుంకర, దీపికా ఆరాధ్య ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Horror Movie: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్! ఎక్కడంటే?

క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యనారయణ సుంకర ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న కోటి లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్ ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. గుబురు గడ్డంతో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు కోటి.

కోటి తనదైన శైలిలో అద్భుతమైన డైలాగ్ చెప్పారు. వాడు ఆఖరి క్షణంలో ఉన్నా.. పని పూర్తి చేసే తీరుతాడు అనే చెప్పే సంభాషణ ఆకట్టుకుంటోంది. పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ఈ గ్లింప్స్ పూర్తవుతుంది. ఇటీవలే ఫైట్ కొరియోగ్రాఫర్స్ రామ్, లక్ష్మణ్ ఈ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

బెనర్జీ, జీవీకే నాయుడు. కరాటే కల్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌గా నటించడమే కాకుండా సంగీతాన్ని కూడా కోటినే సమకూర్చడం విశేషం. నవీన్ కుమార్ చల్లా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. పాపారావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. రామ్ సుంకర ఫైట్ మాస్టార్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని అధికారిక తేదీని ప్రకటించనున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం